రాష్ట్రీయం

కాదంటే.. సమ్మెకే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 30: కేంద్ర ప్రభుత్వం రైల్వే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి దిగిరాకుంటే జాతీయస్థాయిలో అన్ని కేంద్ర ప్రభుత్వ యూనియన్లతో కలిసి మార్చి మొదటివారంలో నిరవధిక సమ్మె చేస్తామని భారతీయ రైల్వే ఉద్యోగుల జాతీయ సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎం రాఘవయ్య ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి మొదటివారంలో రైల్వే యూనియన్లతో సంప్రదింపులు జరిపి ముఖ్యమైన సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో ఫిబ్రవరి రెండోవారం స్ట్రైక్ బ్యాలెట్ నిర్వహించి మెజార్టీ ఉద్యోగుల అభిప్రాయం మేరకు సమ్మె నోటీసు రైల్వేకు అందజేస్తామన్నారు. అప్పటికీ కేంద్రం నుంచి సానుకూలధోరణి వ్యక్తం కాకపోతే మార్చి మొదటివారంలో సమ్మె చేస్తామన్నారు. బుధవారం దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ కార్యాలయంలో జరిగిన యూనియన్ 98వ జనరల్ కౌన్సిల్ మీటింగ్‌లో చర్చించి తీర్మానించినట్టు ఆయన తెలిపారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏడొవ వేతన సవరణ సంఘం సిఫారసులు, రైల్వేలో విదేశీప్రత్యక్ష పెట్టుబడులు, రైల్వేల్లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య వ్యవస్థ (పిపిపి), విదేశీ కంపెనీలకు రైల్వే ఆస్తులు అప్పగించడం వంటి వాటిని వ్యతిరేకిస్తూ సమ్మె చేపట్టాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. వీటన్నింటిపై తాము ఇప్పటికిప్పుడే నిరసన తెలియజేయడం లేదని, గత ఏడాది డిసెంబర్ 11న రైల్వే సంయుక్త సంప్రదింపుల కమిటీ సమావేశంలో చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా ఈనెల 24న రైల్వే మంత్రి సురేష్ ప్రభును కలిసి ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఏడవ వేతన సంఘం సిఫారసులు రద్దుచేయాలని కోరినట్టు తెలిపారు. రైల్వే అభివృద్ధికి ఆ శాఖకుగానీ, కేంద్రానికిగానీ సరైన ధృక్పధం లేదన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలు రైల్వే వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తాయన్నారు. ప్రైవేటీకరణను రైల్వేలోకి తీసుకురావడం అంటే జాతి మొత్తం ఆత్మహత్య చేసుకున్నట్టే అవుతుందన్నారు. కేంద్రం కళ్లుతెరచి రైల్వే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే 41ఏళ్ల తర్వాత మళ్లీ రైల్వేలో సమ్మె అనివార్యమయ్యే పరిస్థితులు వస్తాయని హెచ్చరించారు.