రాష్ట్రీయం

విద్యుత్ వడ్డన ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 30: విద్యుత్ చార్జీలు పెంచేందుకు అనుమతించాలని కోరుతూ ఆంధ్రలోని రెండు డిస్కాంలు ఒకట్రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలికి ప్రతిపాదనలు సమర్పించనున్నాయి. వాస్తవానికి ఈ ఏడాది నవంబర్ నెలాఖరులోపలే వార్షిక రెవెన్యూ నివేదికను డిస్కాంలు ఏపిఇఆర్‌సికి అందించాల్సి ఉంటుంది.
ఈసారి ప్రతిపాదనల్లో దాదాపు రూ.1100 కోట్లమేర విద్యుత్ చార్జీలను పెంచి ఆర్ధికంగా సంక్షోభం ఎదుర్కొంటున్న డిస్కాంలను ఆదుకోవాలని కోరుతూ నివేదికను సిద్ధం చేసినట్టు సమాచారం. 2015-17 సంవత్సరానికి అవసరమైన విద్యుదుత్పత్తి, పంపిణీకి అయ్యే వ్యయం, సబ్సిడీ, ఉద్యోగుల వేతనాలు, విద్యుత్ కొనుగోలుకు అయ్యే ఖర్చు తదితర అంచనాలతో నివేదిక సమర్పిస్తారు. 2015-16 సంవత్సరానికి దాదాపు 1200 కోట్ల మేర విద్యుత్ చార్జీలు పెంచేందుకు ఏపిఇఆర్‌సి అనుమతి ఇచ్చిన విషయమే. డిస్కాంలు వార్షిక రెవెన్యూ నివేదిక సమర్పించిన తర్వాత ఏపిఇఆర్‌సి రాష్ట్రంలోని పలు నగరాల్లో బహిరంగ విచారణ నిర్వహించి ప్రజలనుంచి అభిప్రాయాలను సేకరిస్తుంది. అనంతరం ప్రభుత్వ నివేదికను పరిగణనలోకి తీసుకుంటుంది. మార్చి 31లోపల ఏపిఇఆర్‌సి ప్రతిపాదించే చార్జీలపై తన అభిప్రాయం ప్రకటిస్తుంది. ఏపిఇఆర్‌సి పచ్చజెండా ఊపితే 2016 ఏప్రిల్ 1నుంచి సవరించిన చార్జీలు అమలులోకి వస్తాయి. 2015-16కు 16 వేల ఎంయు విద్యుత్ కొనుగోలుకు అనుమతి ఇవ్వాలని ప్రతిపాదిస్తే, ఏపిఇఆర్‌సి కేవలం 757 ఎంయు విద్యుత్ మాత్రమే కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీచేసిన విషయం విదితమే. 2015-16లో విద్యుత్ కొరత తలెత్తకుండా దాదాపు పదివేల ఎంయు విద్యుత్‌ను ఏపి డిస్కాంలు కొనుగోలు చేశాయి. డిస్కాంలు దాదాపు రూ.3వేల కోట్లమేర రెవెన్యూ లోటుతో ఉన్నాయని నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం.