రాష్ట్రీయం

పలకరించిన ఈశాన్య రుతుపవనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 31: ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు, తమిళనాడు, కేరళ, కర్నాటక మధ్య ప్రాంతాలను ఈశాన్య రుతుపవనాలు ఆదివారం పలకరించాయి. నాలుగు నెలల పాటు (జూన్ నుండి అక్టోబర్ మధ్య వరకు) దేశంలోని వివిధ ప్రాంతాలకు వర్షాలను అందించిన నైరుతీ రుతుపవనాలు ఈ నెల 28న వెళ్లిపోయాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) ప్రకటించింది. వాస్తవంగా ఈశాన్య రుతుపవనాలు అక్టోబర్ 20న రావలసి ఉండగా, పదిరోజుల పాటు ఆలస్యంగా వచ్చాయి. ఈశాన్య రుతుపవనాల మూలంగా దక్షిణ భారత్‌లోని రాష్ట్రాల్లో ఎక్కువ వర్షాలు నమోదవుతాయి. ఐఎండి లెక్కల ప్రకారం మనదేశంలోని దక్షిణ రాష్ట్రాల్లో ఏటా కురిసే మొత్తం వర్షాల్లో 60 శాతం వరకు ఈశాన్య రుతుపవనాల మూలంగానే నమోదవుతాయి. ఈ కారణంగానే రెండురోజుల నుండి తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. తెలంగాణ, రాయలసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో పంటలు ప్రధానంగా ఈశాన్య రుతుపవనాల మూలంగా వచ్చే వర్షాల ఆధారంగానే వేస్తుంటారు. ఎపి, తెలంగాణలోని ప్రకాశం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, వరంగల్, రంగారెడ్డి, ఖమ్మం జిలాల్లోని కొన్ని ప్రాంతాల్లో గత 24 గంటల్లో ఒక మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. వరంగల్ జిల్లా గూడురులో ఐదు సెంటీమీటర్లు, రంగారెడ్డి జిల్లా హకీంపేట, ప్రకాశం జిల్లా కందుకూరులో నాలుగేసి సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తమిళనాడు, కేరళ, అండమాన్ నికోబార్ ద్వీపాల్లోని చాలా ప్రాంతాల్లో ఐదు నుండి 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని ఐఎండి ప్రకటించింది. వచ్చేవారంలో కోస్తా జిల్లాల్లో వర్షాపాతం పెరుగుతుందని వివరించారు.