రాష్ట్రీయం

నగరపాలక సంస్థల్లో ప్రత్యేక స్వచ్ఛ భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమండ్రి, డిసెంబర్ 30: కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ ఆదేశాలకు అనుగుణంగా జనవరి 1నుండి 15వరకు రాష్ట్రంలోని నగరపాలక సంస్థల పరిధిలో ప్రత్యేక స్వచ్ఛ భారత్ నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ భారత్ కార్పొరేషన్ ప్రణాళికను సిద్ధంచేసింది. ఈ ప్రణాళికలో భాగంగా అండర్ పాస్‌లు, ఫ్లైఓవర్ వంతెనలు, మెయిన్ రోడ్లను శుభ్రంచేసే కార్యక్రమాలపై కమిషనర్లు దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది. వీటితో పాటు నగర పరిధిలోని డివైడర్లు, రోడ్ల మలుపులను శుభ్రంచేయాలి.
ప్రస్తుతం ఉన్న డస్ట్‌బిన్లకు మరమ్మతులు చేయటం, అవసరమైన ప్రాంతాల్లో కొత్త డస్ట్‌బిన్లు ఏర్పాటుచేయటం, నగర పరిధిలోని బస్టాండ్లకు మరమ్మతులు చేయటం వంటి కార్యక్రమాలను కార్పొరేషన్ అధికారులు చేపట్టాల్సి ఉంటుంది. అండర్ పాస్ గోడలపై స్వచ్చ భారత్ పెయింటింగ్స్‌ను వేయటం ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని కలిగించడానికి ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టాలి. జాతీయరహదారుల వెంబడి ఉన్న ధాబాలు, దుకాణాలు, పెట్రోలు బంకుల యజమానులకు బాధ్యతలు అప్పగించి, తమ ప్రాంతాలు శుభ్రంగా ఉంచేవిధంగా ఏర్పాట్లు చేసుకోవటం, చెత్త లేకుండా చూడటం, డస్ట్‌బిన్లు ఏర్పాటుచేయటం, మరుగుదొడ్లు నిర్మించుకునేలా చేయటం వంటి చర్యలను తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ ఆదేశించారు. జనవరి 2నుండి రాష్ట్రంలో ప్రారంభంకానున్న జన్మభూమి-మావూరు కార్యక్రమాల్లో పాల్గొంటూనే, నగరపాలకసంస్థ అధికారులు, సిబ్బంది కేంద్రప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక స్వచ్ఛ భారత్ కార్యక్రమాలను చేపట్టాల్సి ఉంటుంది.