రాష్ట్రీయం

మారని ద్రావిడ వర్శిటీ తీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 2: భారీ సంఖ్యలో పిహెచ్‌డి అడ్మిషన్లు, ఉద్యోగ నియామకాల్లో అక్రమాలకు పాల్పడినట్టు గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న ద్రావిడ విశ్వవిద్యాలయం మరోమారు విద్యాదోపిడీకి సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్ కుప్పంలో ఉన్న ద్రావిడ విశ్వవిద్యాలయం మరోమారు దూరవిద్యా పరీక్షలను తెలంగాణలో మారుమూల ప్రాంతాల్లో మాత్రమే నిర్వహించడం ద్వారా అక్రమాలకు తెరతీసినట్టు ఆరోపణలు వస్తున్నాయి.
ఈ నెల 7వ తేదీ నుండి దూరవిద్య పరీక్షలను నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్న విశ్వవిద్యాలయం సహజంగా పట్టణాల్లో రాజధాని కేంద్రంలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడానికి బదులు మారుమూల కేంద్రాలను మాత్రమే ఎంపిక చేసింది. పట్టణ కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలు లేవనే సాకుతో హైదరాబాద్ వంటి మహానగరాలకు చెందిన విద్యార్థులను సైతం జగిత్యాల, మహబూబ్‌నగర్, వరంగల్, సిద్దిపేట తదితర పట్టణాల్లో పరీక్షలు రాయించడం వెనుక ఇటు స్టడీ సెంటర్ల యజమానులు, పరీక్ష కేంద్రాల నిర్వాహకులతో యూనివర్శిటీ పెద్దలు కుమ్మక్కు అయినట్టు ఆరోపణలు వస్తున్నాయి. హైదరాబాద్ విద్యార్థులను సిద్దిపేటలో వేయడం వెనుక యూనివర్శిటీ చెబుతున్న కారణాలకు వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని అంటున్నారు. హైదరాబాద్‌లో కేంద్రాలు లేకపోవడం వల్ల తెలంగాణలో మారుమూల ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు వర్శిటీ పెద్దలు చెబుతున్నా, హైదరాబాద్‌లో కేంద్రాలు ఏర్పాటు చేస్తే మీడియా దృష్టి ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నట్టు తెలిసింది. గతంలో ద్రావిడ వర్శిటీ పరీక్ష కేంద్రాల్లో మాస్‌కాపీయింగ్ వీడియోలు తీసి ఎలక్ట్రానిక్ మీడియా ప్రసారం చేసిన నేపథ్యంలో ఈసారి అలాంటి అవకాశం ఇవ్వరాదనే హైదరాబాద్‌లో పరీక్ష కేంద్రాలు లేకుండా చేసినట్టు తెలిసింది. ఎక్కడి విద్యార్థులకు అక్కడే కేంద్రాలు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించాల్సిన యూనివర్శిటీ గత అనుభవాల నుండి దారిలోకి వచ్చినట్టు లేదని విద్యార్థులు విమర్శిస్తున్నారు. మారుమూల కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తే మీడియాతో పాటు ఇతరుల దృష్టి ఉండదని, స్టడీ సెంటర్లకు, పరీక్ష కేంద్రాల నిర్వాహకులకు అనుకూలంగా వ్యవహరించవచ్చనే భావనతోనే యూనివర్శిటీ అధికారులు ఇలా చేస్తున్నారని తెలిసింది. దీనివెనుక పెద్ద నెట్‌వర్క్ పనిచేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. యూనివర్శిటీలోని పరీక్ష నిర్వాహక విభాగం హైదరాబాద్ కేంద్రాన్ని ప్రతిపాదించినా, వైస్ చాన్సలర్ నిరాకరించారని యూనివర్శిటీకి చెందిన ఒక ఉన్నతాధికారి పేర్కొన్నారు. కాగా ఇంతవరకూ పరీక్ష కేంద్రాలపై ఎలాంటి స్పష్టత లేదని, ఇంకా ఖరారు కాలేదని, వాటి వివరాలను గురువారం అందిస్తామని దూరవిద్యా కేంద్ర సంచాలకుడు డాక్టర్ బి ఎస్ శివకుమార్ తెలిపారు.