రాష్ట్రీయం

ఆంధ్రలో అపార వనరులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 30: ఆంధ్రప్రదేశ్‌లో అపార వనరులు, అపరిమితమైన ల్యాండ్ బ్యాంక్, సమృద్ధిగా నీరు, నిరంతర విద్యుత్ అందుబాటులో వున్నాయని, కావాల్సినదంతా కేంద్రంనుంచి సహకారమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియాతో బుధవారం సాయంత్రం విజయవాడలోని తన కార్యాలయంలో సమావేశమైన ముఖ్యమంత్రి రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ కుదేలైందని వివరించారు. ప్రజలు రాజధాని లేక అనాథలు అయ్యారని, అయినా సమస్యలనే సవాళ్లుగా తీసుకుని రాష్ట్భ్రావృద్ధికి పట్టుదలతో కృషి చేస్తున్నామని చెప్పారు. గోదావరి కృష్ణా నదుల అనుసంధానం చేసి రాయలసీమ నీటి అవసరాలను తీర్చడాన్ని తమ ప్రభుత్వం సాధించిన ఘనమైన విజయమని అన్నారు. లోటు నుంచి అతి తొందరగానే బయటపడి మిగులు విద్యుత్ రాష్ట్రంగా అవతరించామని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రాలు పరస్పరం సహకరించుకునేలా చూడటంతోపాటు, కేంద్రం నుంచి రాష్ట్రాలకు సాయం అందినప్పుడే పురోభివృద్ధి సాధ్యమని అన్నారు. విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థకు ఎప్పుడూ తిరుగు ఉండదని, ఆ నమ్మకంతోనే హైదరాబాద్‌లో హైటెక్ సిటీ నిర్మించినట్టు గుర్తు చేశారు. చెన్నై - బెంగళూర్, విశాఖపట్నం - చెన్నై పారిశ్రామిక కారిడార్లు కొత్త రాష్ట్రానికి ఆశాకిరణాలుగా అభివర్ణించారు. గంగవరం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులతోపాటు మరికొన్ని పోర్టులను కూడా అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని తూర్పుతీర ముఖ ద్వారంగా మార్చాలన్నదే ప్రయత్నమన్నారు. రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధితో గుజరాత్, మహారాష్టల్రతో పోటీ పడుతున్నామని, తూర్పు తీర రాష్ట్రాల్లో తామే ఎగుమతుల్లో ముందున్నట్టు చెప్పారు. ఈ ప్రయత్నానికి కేంద్రం సహకరించి రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేలా కృషి చేయాలని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌ను కోరారు.
మరోవైపు రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ పథకాలు, కార్యక్రమాలు, ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి వ్యూహాల గురించి అధికారులు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌ను వివరించారు. గడచిన కొనే్నళ్లుగా దక్షిణకొరియా, సింగపూర్, తైవాన్, చైనా ఎలా అద్భుతమైన వృద్ధి రేటుతో దూసుకెళుతున్నాయో ఈ సందర్భంగా అరవింద్ పనగరియా ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు పవర పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. చైనా సరాసరి అభివృద్ధి రేటు 1981 నుంచి 2013 వరకు 10 శాతంగా ఉందని, దీనికి కారణం ఆ దేశం తయారీ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడమేనని అన్నారు. భారత్ కూడా సేవల రంగంలో వృద్ధి సాధిస్తోందని, పరిశ్రమల రంగంలో వృద్ధి స్థిరంగా కొనసాగుతోందని అన్నారు. అయితే జిడిపిలో వ్యవసాయం రంగం వాటా తగ్గుతూ వస్తుండటం ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు. వ్యవసాయేతర రంగాల్లో ఉపాధి అవకాశాలు అనూహ్యంగా పెరిగాయని, వ్యవసాయంపై ఆధారపడి జీవించే వారి సంఖ్య తగ్గిందని వివరించారు. జిడిపిలో 15 శాతం వాటా కలిగిన వ్యవసాయ రంగంపై ఇంకా 49 శాతం మంది ఆధారపడి ఉండటం పరిశీలించాల్సిన అంశమని చెప్పారు. ముఖ్యంగా కోస్టల్ ఎకనామిక్ జోన్‌లు, సాగర్‌మాల ప్రాజెక్టు అనేవి భారత్ అభివృద్ధికి సరికొత్త వ్యూహాలుగా చెప్పారు. సుదీర్ఘ కోస్తా తీరం ఉన్న ఆంధ్రప్రదేశ్‌కి ఇది ఎంతో శుభపరిణామమన్నారు. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌సి ఠక్కర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పివి రమేష్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుంటుంబరావుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

చిత్రం... ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైన నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా