రాష్ట్రీయం

ఆర్కే సురక్షితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 3: మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ సురక్షితంగా ఉన్నాడని విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు గురువారం రాత్రి ప్రకటించారు. అయితే ఆర్కే ఎక్కడ ఎలా ఉన్నారో మాత్రం వరవరరావు వివరాలు వెల్లడించలేదు. కాగా ఈ విషయంపై ఆంధ్ర డిజిపి సాంబశివరావు స్పందిస్తూ మావోయిస్టులు, ఆ పార్టీ సానుభూతిపరులు మైండ్ గేమ్ ఆడుతున్నారని, గత ఇరవై ఏళ్లుగా వారు ఈ పద్ధతికి అలవాటుపడ్డారన్నారు. ఈ అంశంపై జాతీయస్థాయిలో తాము కూడా చర్చ లేవనెత్తుతామన్నారు. గత నెల 24న మల్కన్‌గిరిలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్ తరువాత ఆర్కే ఉనికిపై పది రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. ఆయన భార్య శిరీష, పౌరహక్కుల సంఘం హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. ఈ నేపథ్యంలో ఆర్కే సురక్షితంగానే ఉన్నట్టు విరసం నేత వరవరరావు ప్రకటనతో ఉత్కంఠకు తెరపడినట్టు తెలుస్తోంది.
కాగా గురువారం ఉదయం హైకోర్టులో ఆర్కే ఉనికికి సంబంధించి దాఖలైన కేసుపై విచారణ జరిగింది. ఆర్కే తమ దగ్గర లేడని విశాఖ రూరల్ ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. గత నెలలో ఏఓబిలో ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశంలో ఆర్కే ఉన్నాడా లేదా అనే విషయం తమకు తెలియదని ఆయన అఫిడవిట్‌లో స్పష్టం చేశారు. రామకృష్ణపై మొత్తం 40 కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఇందులో విశాఖ రూరల్‌లో 22కేసులు నమోదై ఉన్నాయన్నారు. అయితే, ఈ సమయంలో హైకోర్టు జోక్యం చేసుకుని రామకృష్ణ పోలీసు కస్టడీలో ఉన్నాడని చెప్పేందుకు ఆధారాలు ఉన్నాయా అని పిటిషనర్లను ప్రశ్నించింది. తమకు ఆధారాలు చూపించేందుకు రెండు వారాలు గడువు కావాలని పిటిషనర్లు కోరారు. అనంతరం ఈకేసు విచారణను రెండు వారాల పాటు హైకోర్టు వాయిదా వేసింది. అయితే గురువారం సాయంత్రానికే వరవరరావు ఆర్కే క్షేమంగా ఉన్నట్లు ప్రకటించటంతో వివాదానికి తెరపడింది.