రాష్ట్రీయం

భూసేకరణపై స్పెషల్ డ్రైవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 3: జిల్లాల పునర్విభజన తర్వాత కలెక్టర్లు అందరూ ఉత్సాహంగా, ప్రో యాక్టివ్‌గా పని చేస్తున్నందున భూ సేకరణ సహా అన్ని కార్యక్రమాలు విజయవంతం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రాజెక్టుల నిర్మాణానికి భూ సేకరణ అత్యంత కీలకమని దీనికి ప్రతి కలెక్టర్ ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. భూములు ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చే రైతులకు 123 జివో కింద పరిహారం ఇవ్వాలని, అలా కానీ పక్షంలో 2013 చట్టం కింద భూ సేకరణ జరపాలని చెప్పారు. చివరి భూముల
వరకు సాగునీరు లభించే విధంగా మధ్యప్రదేశ్‌లో ‘టేల్ టు హెడ్’ పద్దతిలో సాగునీటి పంపిణీ జరుగుతోందని జిల్లా కలెక్టర్లు తమ జిల్లాల్లో ఒక ప్రాజెక్టు లేదా డిస్ట్రిబ్యూటరీ కెనాల్ నుంచి ప్రయోగాత్మకంగా ఈ పద్ధతికి శ్రీకారం చుట్టాలని హరీశ్‌రావు సూచించారు. అన్ని చెరువుల కింద యాసంగి(రబీ) సీజన్‌లో రైతులకు సాగునీటిని ఇవ్వాలని నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సూచించారు. మహబూబ్‌నగర్ జిల్లా, ఖమ్మంలోని కొన్ని ప్రాంతాలు మినహా తెలంగాణ అంతటా వర్షాలు సమృద్ధిగా కురవడంతో చెరువులు నిండాయని, వాటి నుంచి రైతులకు సాగునీటిని సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్లకు మంత్రి చెప్పారు. సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇరిగేషన్, వ్యవసాయ, హార్టికల్చర్, రెవెన్యూ అధికారులు, ఎంఎల్‌ఏలు, ఇతర ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకోని యాసంగి పంటకు సాగునీటి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. రైతులకు ముందస్తు సమాచారం సరిగా లేకపోతే తర్వాత ఆందోళన చెందుతారని అన్నారు. భవిష్యత్తులో చెరువులు కబ్జా కాకుండా ఉండేందుకు చెరువుల మ్యాప్‌లు, అదే విధంగా ఆయకట్టు మ్యాప్‌లు రూపొందించాలని జిల్లా కలెక్టర్లను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు సంయుక్తంగా చెరువుల కింద వాస్తవ ఆయకట్టును నమోదు చేయాలని మంత్రి కోరారు. మైనర్ ఇరిగేషన్‌తో పాటు మీడియం, మేజర్ ప్రాజెక్టుల కింద కూడా యాసంగి సాగు యాక్షన్ ప్లాన్ రూపొందించాలని జిల్ల కలెక్టర్లను కోరారు.
మిషన్ కాకతీయ మూడవ దశ కింద ఈనెలాఖరులోగా ప్రతిపాదనలు పంపాలని జిల్లా కలెక్టర్లకు మంత్రి సూచించారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, ఖమ్మంలో కొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదైనందున ఆ ప్రాంతాల్లో మిషన్ కాకతీయ మూడవ ఫేజ్ కింద పనులు చేపట్టాలని చెప్పారు.