రాష్ట్రీయం

సైన్యానికి అవమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 3: లక్షిత దాడులకు ఆధారాలు చూపాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆధారాలు చూపాలని అనడం సిగ్గుచేటని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ విమర్శించారు. సైనికులను అవమానపరిచేవిధంగా మాట్లాడిన రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ పార్టీ సైనికులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఢిల్లీలో సైనికోద్యోగి రామ్‌కిషన్ గ్రోవర్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లే నైతిక హక్కు రాహుల్‌కు లేదని అన్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఓకే ర్యాంకు ఒకే పించను అమలు చేయక, సైనికులను వంచించి మోసం చేసిన ఘనత ఆ పార్టీదేనని అన్నారు.
కేంద్ర న్యాయశాఖ మంత్రి రాక
కేంద్ర న్యాయ శాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ శుక్రవారం నాడు నగరానికి రానున్నారు. రాష్ట్రీయ ఏక్తాదివస్‌లో భాగంగా అసెంబ్లీ సమీపంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ముందు జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అనంతరం ఆయన ఆర్టీసీ కళా భవన్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ జాతి పునర్నిర్మాణంలో చిక్కులు, అత్యవసర విషయాలు అనే అంశంపై మాట్లాడతారు.