తెలంగాణ

నిరుద్యోగులకు కొత్త ఏడాది కానుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 30: తెలంగాణ నిరుద్యోగ యువకులకు నూతన సంవత్సర కానుకగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (టిఎస్‌పిఎస్‌సి) గ్రూప్-2 పోస్టులతో పాటు వేర్వేరుగా నాలుగు నోటిఫికేషన్లను బుధవారం విడుదల చేసింది. గ్రూప్-2 కేటగిరిలో 439 పోస్టులను భర్తీ చేయనున్నట్టు టిఎస్‌పిఎస్‌సి విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ కేటగిరిలో సబ్ రిజిస్ట్రార్, మున్సిపల్ కమిషనర్, అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్, అబ్కారీ సబ్ ఇన్స్‌పెక్టర్ పోస్టులు ఉన్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్‌లో ప్రకటించిన పోస్టులకు నేటి నుంచి (గురువారం-డిసెంబర్ 31) ఫిబ్రవరి 9, 2016 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అలాగే ఏప్రిల్ 24, 25 తేదీలలో రెండు రోజుల పాటు వీటి భర్తీకి పరీక్ష నిర్వహించనున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. మరో నోటిఫికేషన్‌లో హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ బోర్డులో డిప్యూటీ మేనేజర్ పోస్టులు రెండింటికి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటికి డిసెంబర్ 31 నుంచి జనవరి 2016 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఫిబ్రవరి 21వ తేదీన రాత పరీక్ష నిర్వహించనున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అలాగే హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ బోర్డులో టెక్నిషియన్ గ్రేడ్-2 విభాగంలో 44 పోస్టులకు మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటికి డిసెంబర్ 31 నుంచి జనవరి 28 వరకు దరఖాస్తులు స్వీకరించి, మార్చి 2016 పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష తేదీని తర్వాత ప్రకటించనున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండటం వల్ల నోటిఫికేషన్ విడుదలలో జాప్యం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను బుధవారం ప్రకటించడంతో ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం టిఎస్‌పిఎస్‌సి నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా గ్రూప్-2 పోస్టులతో పాటు మరో 311 అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి కూడా టిఎస్‌పిఎస్‌సి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటికి డిసెంబర్ 31 నుంచి జనవరి 25వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. వీటికి కూడా మార్చి 2016లో పరీక్ష నిర్వహించనున్నట్టు ప్రకటించింది. అయితే పరీక్ష తేదీని తర్వాత ప్రకటించనున్నట్టు టిఎస్‌పిఎస్‌సి విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. గ్రూప్-2 పోస్టులలో ఎక్స్‌జు సబ్ ఇన్స్‌పెక్టర్ పోస్టులు 220, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-3 పోస్టులు 19, అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ పోస్టులు 110 భర్తీ చేయనున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొంది.