రాష్ట్రీయం

గాంధీ పాత్ర ప్రశ్నార్థకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 4: మహానేత సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ ప్రధాని కావల్సిందని, కాని ఈ విషయంలో మహాత్మాగాంధీ పాత్ర ప్రశ్నార్థకమని కేంద్ర కమ్యూనికేషన్లు, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. పటేల్ లేకుంటే భారతదేశ స్థితిని మనం ఊహించలేమని చెప్పారు. భారత నవనిర్మాణం లోగుట్టు, అత్యవసరాలు అనే అంశంపై శుక్రవారం రాత్రి ఇక్కడి ఆర్టీసీ కళాభవన్‌లో జరిగిన ప్రత్యేక సదస్సులో ఆయన మాట్లాడుతూ గొప్ప దార్శనికత, దూరదృష్టి , రాజనీతిజ్ఞత ఉన్న నేత సర్దార్ పటేల్ అని పేర్కొన్నారు. దేశంలో రక్తపాతం లేకుండా అన్ని సంస్థానాలను విలీనం చేయడంలో చాలా కీలక పాత్ర పోషించారని చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత పటేల్ కేవలం మూడేళ్లు మాత్రమే జీవించారని, ఆ కాలంలో ఆయన చేసిన ఘనకార్యాలు అపూర్వమని అన్నారు. దేశంలో సివిల్ సర్వీసుల ఏర్పాటులో ఆయన పాత్ర అనన్యసామాన్యమని చెప్పారు. పటేల్‌ను గొప్పనాయకుడిగా కీర్తిస్తూనే కాంగ్రెస్ పార్టీ ఆయనపై వివక్ష చూపిందని , చిన్న చిన్న నేతలకు సైతం భారతరత్న ఇచ్చిన కాంగ్రెస్‌కు పటేల్‌కు ఆ పురస్కారం ఇవ్వడానికి మనసొప్పలేదని, చివరికి పివి నర్సింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో పటేల్‌కు భారతరత్న దక్కిందని అన్నారు. అలాగే పటేల్ పేరిట తపాలా ముద్ర లేకుండా చేసిందని, దీనికి కారణాలు ఏమిటో ఆ పార్టీయే పునరాలోచించుకోవాలని అన్నారు. దేశంలో అన్ని సంస్థానాలను విలీనం చేయడంలో పటేల్ విజయం సాధిస్తే జమ్మూకాశ్మీర్ వ్యవహారాన్ని నెహ్రూ డీల్ చేశారని ఇపుడు ఆ రాష్ట్రం పరిస్థితి ఏమిటో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. స్వాతంత్య్ర సమరంలో పోరాడిన వాళ్లంతా న్యాయవాదులేనని, నెహ్రూ తప్ప అంటూ న్యాయవాదులను ఉద్దేశించి రవిశంకర్ చమత్కరించారు. అంతకుముందు బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ గొప్ప ఆలోచనా విధానానికి, గ్రామవికాసానికి ఎంతో కృషి చేసిన పటేల్ భారత జాతికి, సంస్కృతికి ఆత్మ వంటి వారని అన్నారు. దేశంలో అత్యున్నత నేతల్లో పటేల్ ఒకరని అన్నారు. దేశ పునర్నిర్మాణం, జాతి నిర్మాణం చాలా ముఖ్యమైన విషయాలని, దేశానికి గట్టి పునాది వేసిన వారిలో పటేల్ అగ్రగామి అని చెప్పారు. డాక్టర్ కె లక్ష్మణ్ మాట్లాడుతూ ఇప్పటికైనా టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఐక్యతా దినోత్సవాన్ని నిర్వహించాలని సూచించారు. దేశవ్యాప్తంగా ఏక్తా సదస్సు నిర్వహించాలని కేంద్రం సూచిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం దానిని గౌరవించడం లేదన్నారు. చరిత్రలో చిరస్థాయిగా నిలిచే పటేల్ చరిత్రను విస్మరించారని, కాని నేడు ఆయన చరిత్రను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.

శుక్రవారం హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళాభవన్‌లో జరిగిన ప్రత్యేక సదస్సులో ప్రసంగిస్తున్న
కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్

అపోలో ఆసుపత్రిలో
6 నెలల శిశువుకు
కాలేయ మార్పిడి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, నవంబర్ 4: అపోలో ఆసుపత్రి వైద్యులు ఆరు నెలల శిశువుకు అరుదైన కాలేయ మార్పిడి శస్తచ్రికిత్స చేశారు. పుట్టుకతోనే కాలేయం నుండి క్లోమరసం స్రవించకుండా రంధ్రం మూసుకుపోవడంతో అరుదైన కాలేయానికి సంబంధించిన సమస్యతో ఆరు నెలల చిన్నారి నితేష్ బాధపడుతోంది. చిన్నారి నితేష్‌కు అతని తండ్రికి చెందిన కాలేయం నుంచి ఒక చిన్న ముక్కను తీసుకుని కాలేయ శస్తచ్రికిత్స నిర్వహించామని, ఆ బాలుడు కోలుకుంటున్నాడు. ఈ వివరాలను అపోలో ఆసుపత్రి చీఫ్ ట్రాన్స్‌ఫ్లాంట్ సర్జన్ డాక్టర్ మనీష్ సి వర్మ తెలిపారు. ఈ బాలుడికి కాలేయంలో తలెత్తిన పరిస్థితిని బైలరీ అట్రెసియా అని అంటారు. ఈ పరిస్ధితి వల్ల శరీరంలో ఆహారం జీర్ణం కావడానికి అవసరమయ్యే పిత్తరసం కాలేయం నుండి పేగుల్లోకి ప్రవహించదు. పుట్టిన పిల్లల్లో 10 నుంచి 15 వేల మందిలో ఒకరు ఈ జబ్బు బారిన పడే ప్రమాదం ఉంది. కాలేయం నుంచి క్లోమరసం ప్రవహించే నాళంలో అడ్డంకి ఏర్పడడం లేదా అసాధారణంగా ప్రవహించడం వల్ల ఇలాంటి పరిస్ధితి ఏర్పడి కాలేయ వైఫల్యానికి దారితీస్తుంది. పుట్టిన రెండు వారాల తర్వాత వీరిలో కామెర్ల వ్యాధి లక్షణాలు కనపడుతాయి. వీరికి వెంటనే చికిత్స అందగపోతే దీర్ఘకాలిక కాలేయ వ్యాధికి గురవుతారు. భీమవరంకు చెందిన నితేష్ బాలుడుకు స్ధానికంగా చికిత్స అందించినా కామెర్లు తగ్గలేదు. దీంతో అపోలో ఆసుపత్రిలో చేర్చించగా కాలేయ మార్పిడి ఒక్కటే ఏకైక చికిత్సగా భావించామని డాక్టర్ మనీష్ సి వర్మ చెప్పారు. ఈ శిశువుకు కాలేయ మార్పిడి చేయడానికి వేరొకరి కాలేయంలోని చిన్న ముక్కు అవసరమైంది. అతని తల్లి, అమ్మమ్మలకు చెందిన కాలేయం సరిపోలేదు. చిన్నారి నితేష్ తండ్రికి చెందిన కాలేయం నుంచి ఒక చిన్న ముక్కను తీసుకుని గత నెల 13వ తేదీనన కాలేయ మార్పిడి శస్తచ్రికిత్స చేశామన్నారు. తమ ఆసుపత్రిలో నిర్వహించిన కాలేయ మార్పిడిల్లో 95 శాతం విజయవంతమైనట్లు చెప్పారు.

విదేశాల్లో ఉద్యోగాల పేరిట దగా
మోసాలకు పాల్పడిన
ముఠా అరెస్టు
హైదరాబాద్/బేగంపేట, నవంబర్ 4: విదేశాల్లో నిరుద్యోగులకు ఉద్యోగాలిప్పిస్తామని నకిలీ కన్సల్టెన్సీ ఏజెన్సీలను ఏర్పాటు చేసి మోసాలకు పాల్పడుతున్న ఆరుగురు వ్యక్తులను నగర టాస్క్ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సికింద్రాబాద్‌లోని టాస్క్ఫోర్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డిసిపి లింబారెడ్డి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. బంజారాహిల్స్, హుమయూన్‌నగర్, మహంకాళి, అబిడ్స్ పోలీసుస్టేషన్ పరిధిలోని నకిలీ కన్సల్టెన్సీ కేంద్రాలపై వెస్ట్, సెంట్రల్, నార్త్‌జోన్ టాస్క్ఫోర్స్ టీమ్స్ దాడులు నిర్వహించి ఏజెన్సీలను నడుపుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 44 ఇండియన్ పాస్‌పోర్టులతో పాటు రిజిస్టర్‌లు, బయోడేటా ఫారాలు, మెడికల్ రిపోర్ట్సుకు సంబంధించిన పత్రాలు, కరపత్రాలు, విజిటింగ్ కార్డ్స్, సెల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. టోలీచౌకి, హకీంపేట్ లిమ్రా కేఫ్ ఎదురుగా ఓవర్సీస్ ప్లేస్‌మెంట్స్, హెచ్‌ఆర్ సర్వీసెస్‌ను నిర్వహిస్తున్న ఇర్ఫాన్ అలీఖాన్(35), టోలీచౌకిలోనే రిజ్వాన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వాహకుడు మహ్మద్ రిజ్వాన్ ఖురేషి(46), టోలీచౌకిలోని సలీమ్ మసూద్ కాంప్లెక్స్ దక్కన్ వింగ్స్ ఎంటర్‌ప్రైజెస్ నిర్వాహకుడు సయ్యద్ అబ్దుల్ రహీమ్(35), సికింద్రాబాద్ ప్యారడైజ్ సర్కిల్‌లోని చంద్రలోక్ కాంప్లెక్స్ మూడో అంతస్తులో మునావర్ టూర్స్, ట్రావెల్ ప్రొప్రైటర్ మహ్మద్ సలీమ్‌ఖాన్(39), చాపెల్ రోడ్డులోని ఖాన్ లతీఫ్‌ఖాన్ కాంప్లెక్స్‌లో రాయల్ ట్రావెల్స్ మేనేజర్ మహ్మద్ అయూబ్‌ఖాన్(47)లు గత కొంతకాలంగా నిరుద్యోగులకు ఉద్యోగాలిప్పిస్తామని నకిలీ ఏజెన్సీలను నెలకొల్పి మోసాలకు పాల్పడుతున్నారు. ఈ ఆరుగురిని శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన్నట్లు డిసిపి లింబారెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో టాస్క్ఫోర్స్ పోలీసు ఇన్‌స్పెక్టర్లు ఎల్.రాజావెంకట్‌రెడ్డి, పి.బల్వంతయ్య, బి.జానయ్య తదితరులు పాల్గొన్నారు.
నకిలీ ఏజెన్సీ వివరాలను వెల్లడిస్తున్న టాస్స్‌ఫోర్స్ డిసిపి లింబారెడ్డి