రాష్ట్రీయం

జీతాలు తీసుకుంటూ చేతులు చాపుతారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 4: ‘‘మీకేం రోగం... చేతులు చాచకుండా పనిచేయలేరా? ప్రభుత్వం మీకు జీతాలు ఇస్తోంది కదా? అయినా చేతులు చాస్తున్నారు, ఇకపై ఇలాంటివి సహించేది లేదు’’ అని పౌర సరఫరాల శాఖ కమిషనర్ సివి ఆనంద్ అవినీతికి పాల్పడుతున్న ఉద్యోగులపై మండిపడ్డారు. సివి ఆనంద్ పౌర సరఫరాల శాఖ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అవినీతిని నిర్మూలించేందుకు పలు నిర్ణయాలు తీసుకున్నారు. కొందరు అధికారులపై వేటు కూడా వేశారు. పౌర సరఫరాల శాఖలో తొలిసారిగా ఐపిఎస్ అధికారిని కమిషనర్‌గా వేశారు. ఐపిఎస్ అధికారిని నియమించడంపై కొందరు ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తీరా ఇప్పుడు కమిషనర్ అవినీతిని అరికట్టే విధంగా పలు చర్యలు తీసుకోవడం అవినీతిపరులకు మింగుడుపడడం లేదు.
పౌర సరఫరాల సంస్థలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది, రిటైర్డ్ ఉద్యోగులపై వస్తున్న అవినీతి ఆరోపణలపై కమిషనర్ ఆనంద్ శుక్రవారం జరిగిన సమావేశంలో తీవ్రంగా స్పందించారు. క్వాలిటీ కంట్రోల్ విభాగంలో పనిచేస్తున్న నలుగురు రిటైర్డ్ ఉద్యోగులపై వేటువేశారు. తొలగించిన వారిలో ఎంఎన్‌ఎ సలీం (కరీంనగర్), జె.్భస్కర్‌రెడ్డి (నల్గొండ), వి వెంకటరమణ (ఖమ్మం), ఎం. బాల్‌రెడ్డి (రంగారెడ్డి) ఉన్నారు. ‘రిటైర్ అయిన తరువాత కూడా వీరిపై శాఖ పరంగా చర్య తీసుకుంటారు. మీరు మారకపోతే మీపై కూడా కఠిన చర్యలు తప్పవు’ అని ఆయన హెచ్చరించారు. పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో జిల్లా మేనేజర్లు, టెక్నికల్ సిబ్బందితో కమిషనర్ సమావేశమయ్యారు. ధాన్యం కొనుగోళ్లపై చర్చించారు. ఈ సందర్భంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కొంతమంది ఉద్యోగుల పేర్లు చదివి వినిపించారు. ఎక్కడెక్కడ, ఎవరెవరు అవినీతికి ఏ విధంగా అవినీతికి పాల్పడుతున్నారో వివరాలు అన్నీ ఉన్నాయని కమిషనర్ సవివరంగా చెప్పడంతో ఉద్యోగులు విస్తుపోయారు. ‘‘నేను కమిషనర్‌గా వచ్చి రెండున్నర నెలలు అవుతోంది. ఇష్టారాజ్యంగా ఉన్నవారి ఆలోచనలో మార్పు వచ్చింది, ఉద్యోగుల్లో మార్పు వచ్చింది. కానీ కొందరు టెక్నికల్ సిబ్బందిలో మార్పు కనిపించడం లేదు. అవినీతి ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. నేను కఠినంగా వ్యవహరిస్తుంటే మీరేమో ఏకంగా మిల్లర్ల నుండి పర్సంటేజీల రేట్లు పెంచుకుంటూ పోతున్నారు, ఏం జరుగుతోందో నాకు తెలుసు. ప్రతి 270 క్వింటాళ్లకు మీరు ఒక రేటు ఫిక్స్ చేశారు. పర్సంటేజీలు లేకుంటే బతకలేరా?’’ అని కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘మిల్లర్లతో జరిపిన పలు సమావేశాల్లో వారిలో మార్పు కనిపిస్తోందని, 50 నుంచి 60 శాతం వరకు మిల్లర్లు మంచివారేనని, 30 శాతం మంది మీతో కుమ్మక్కు అయ్యారు’’ అని ఆనంద్ ఉద్యోగులకు తెలిపారు. ‘‘మీరు ఎవరెవరు ఏం చేస్తున్నారో, ఎవరెవరి వద్ద ఎంతెంత తీసుకుంటున్నారో నా దగ్గర ఎసిబి, విజిలెన్స్ నివేదికలు ఉన్నాయి. నిజాయితీగా ఉండే మిల్లర్లను కూడా మీరు వదలడం లేదు, తప్పుచేసే వాళ్లను ప్రోత్సహిస్తున్నారు’’ అని ఆనంద్ ఉద్యోగులపై మండిపడ్డారు. ‘‘ఇదే చివరి అవకాశం. ఇకపై ఎవరినీ సహించేది లేదు, గతంలో ఏంచేశారు అనేది అనవసరం. జిల్లా మేనేజర్లతో సహా తప్పు చేస్తే ఎవరినీ వదిలేది లేదు’’ అని హెచ్చరించారు.
‘‘పరిస్థితి ఇలానే ఉంటే నష్టపోయేది మీరే. కార్పొరేషన్‌ను చంపకండి, బతికించుకోండి. హౌసింగ్ కార్పొరేషన్ పరిస్థితి మన కళ్లముందే కనిపిస్తోంది’’ అంటూ ఉదాహరణలతో వివరించారు. హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలో జీరో కరప్షన్ ఉండాలని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కమిషనర్ ఆనంద్ ఆదేశించారు.

శుక్రవారం హైదరాబాద్‌లోని పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో జిల్లా
మేనేజర్లు, టెక్నికల్ సిబ్బందితో సమావేశమైన పౌరసరఫరాల కమిషనర్ ఆనంద్