రాష్ట్రీయం

బాలబాలికలపై అఘాయిత్యాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 5: హైదరాబాద్ నగరంలో ఇద్దరు కవల ఆడపిల్లలపై పొరుగున ఉన్న ఒక వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడి అత్యాచారాలకు పాల్పడిన ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. బాలబాలికలపై అత్యాచారాలకు, వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హోంశాఖ హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లను ఆదేశించింది.
ఈ కేసులో సాక్షాత్తూ తల్లికి తన ఇద్దరు పిల్లలను వేధిస్తున్న వ్యక్తి తెలిసి ఉండడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఈ కేసులో నిందితుడిని, పిల్లల తల్లిని పోలీసులు అరెస్టు చేశారు. మాదాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఒక కామాంధుడికి 13 సంవత్సరాల బాలిక గర్భందాల్చిన సంఘటన జరిగింది.
ఈ కేసులో బాలిక సోదరి స్నేహితుడే నిందితుడు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2015లో విడుదల చేసిన నేర గణాంక వివరాల ప్రకారం పిల్లలపై అత్యాచార ఘటనల నేరాల్లో తెలంగాణ ఆరవ స్థానంలో నిలిచింది. మహారాష్టల్రో 2231 నేరాలు, మధ్యప్రదేశ్‌లో 1568 కేసులు, ఒడిశాలో 1052, రాజస్థాన్‌లో 728, కేరళలో 720, తెలంగాణలో 705 ఘటనలు నమోదయ్యాయి. దేశం మొత్తం మీద 8744 కేసులు నమోదయ్యాయి. దేశం మొత్తం మీద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెనె్సస్ (పివోసిఎస్‌ఒ) చట్టం కింద 8291 కేసుల్లో బాధితులకు నిందితులు తెలిసి ఉన్నట్లు ఎన్‌సిఆర్‌బి రికార్డుల్లో వెల్లడైంది.
ఈ ఏడాది మేలో హైదరాబాద్‌లో భరోసా కేంద్రాన్ని హైదరాబాద్ పోలీసులు ఏర్పాటు చేశారు. లైంగిక నేరాల బాధితులు ఈ సెంటర్‌ను ఆశ్రయిస్తుంటారు. ఇంతవరకు 15మంది పిల్లలపై జరిగిన అత్యాచారాల కేసులు భరోసా దృష్టికి వచ్చాయి. ఇందులో నలుగురు బాలురు ఉన్నారు.