రాష్ట్రీయం

ఫిబ్రవరిలో ఎపిఎన్జీవో మహాసభలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, డిసెంబర్ 30: వచ్చే ఫిబ్రవరి 12, 13 తేదీల్లో శ్రీకాకుళంలో ఎన్టీవోల రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి అశోక్‌బాబు చెప్పారు. మహాసభలు జరగనున్న శ్రీకాకుళంలోని శివానీ కళాశాల మైదానాన్ని పరిశీలించిన అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్‌లో 18 మహాసభలు జరగాయని, రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా నవ్యాంధ్రప్రదేశ్‌లో 19వ మహాసభ ఉద్యమాల గడ్డయైన సిక్కోల్‌లో నిర్వహించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. ఈ మహాసభలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారన్నారు. 4500 మంది ప్రతినిధులు హాజరుకానున్నారని తెలిపారు. జెఎసిలోని అన్ని సంఘాలు, ఆల్ ఇండియా గవర్నమెంటు ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు ఈ మహాసభలకు హాజరవుతారన్నారు. ఉద్యోగుల్లో ఇప్పటికే ప్రభుత్వంపై వ్యతిరేకత చోటు చేసుకుందని అశోక్‌బాబు అన్నారు. ఉద్యోగులకు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాలేకపోతున్నామన్నారు. ఉద్యోగుల హెల్త్ కార్డులు, కాంట్రాక్టు వ్యవస్థ రెగ్యులైరేజషన్, జనవరి 2015 నుంచి చెల్లించాల్సిన కరవు భత్యంపై ప్రభుత్వ తీరు పట్ల ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. వీటిపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనకు దిగక తప్పదన్నారు.

ఎర్రచందనం స్మగ్లర్
మస్తాన్‌వలీ కోసం గాలింపు

చాగలమర్రి, డిసెంబర్ 30: కర్నూలు జిల్లా చాగలమర్రి ఎంపిపి, ఎర్రచందనం స్మగ్లర్ మస్తాన్‌వలీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈనెల 22వ తేదీ మస్తాన్‌వలి రహస్యంగా వచ్చి మండల పరిషత్ కార్యాలయంలోని రిజిస్టర్‌లో సంతకం పెట్టి వెళ్లినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్‌ఐ సుబ్బరామిరెడ్డి బుధవారం ఎంపిపి కార్యాలయానికి చేరుకుని రిజిస్టర్‌ను పరిశీలించారు. మస్తాన్‌వలీ గురించి ఎంపిడివో శ్రీలత, కార్యాలయం సిబ్బందితో చర్చించారు. ఎర్రచందనం కేసులో మస్తాన్‌వలీ ముద్దాయిగా ఉన్న సంగతి తెలిసిందే. కడప జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన మస్తాన్‌వలీ అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఈ నేపధ్యంలో ఈనెల 22వ తేదీ మండల పరిషత్ కార్యాలయానికి రహస్యంగా చేరుకుని రిజిస్టర్‌లో సంతకం పెట్టడం సంచలనం రేపింది. దీంతో మస్తాన్‌వలీని తిరిగి అరెస్టు చేసేందుకు పోలీసులు వేట ముమ్మరం చేశారు.