రాష్ట్రీయం

ఇక లోకల్ నెట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 5: భవిష్యత్‌లో అన్ని భారతీయ భాషల్లో ఇంటర్‌నెట్ అందుబాటులోకి రానుందని కేంద్ర కమ్యూకేషన్లు, న్యాయ శాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని హైటెక్స్ నోవాటెల్‌లో జరుగుతున్న ఐకాన్ 57వ విశ్వ సదస్సు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న రవిశంకర్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఇంటర్ నెట్ భాష ఇంగ్లీషుకు మాత్రమే పరిమితం కాబోదన్నారు. భవిష్యత్‌లో మరింత చౌకగా అందరికీ ఇంటర్‌నెట్ అందించాల్సి ఉందని, ఈ విషయంలో ఐకాన్ మరింత చొరవ తీసుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచానికి పెనుముప్పుగా సైబర్ దాడులు మారనున్నాయని, అదొక రక్తం చిందించని యుద్ధమని హెచ్చరించారు. సురక్షితమైన ఇంటర్‌నెట్ సేవలు అందరికీ అందేలా చూడాలని, ఇందుకు బాధ్యులు కృషి చేయాలని సూచించారు. ఇంటర్‌నెట్ సమర్ధ వినియోగంలో సురక్షితం కూడా కీలక అంశం అవుతుందన్నారు. ఇంటర్‌నెట్ అనేది కాల్పానిక ప్రపంచానికి సంబంధించిందని, అయితే కాల్పానిక ప్రపంచంలోని సమస్యలు వాస్తవ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయని అర్ధం చేసుకోవాలని చెప్పారు. భారతదేశం తీవ్రవాదం, ఉగ్రవాదంతో ఇబ్బంది పడుతోందని, వారు కూడా టెక్నాలజీ వాడుతున్నారని మంత్రి గుర్తు చేశారు. ఈ పరిస్థితులను అధిగమించాలంటే అంతా కలిసి పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఒకపక్క స్వేచ్ఛ, వాక్‌స్వాతంత్య్రాన్ని గౌరవించే భారత్‌లో సైబర్ దాడులను సైతం తట్టుకునేలా ఫైర్‌వాల్ నిర్మించుకోవాల్సి ఉందని చెప్పారు. ప్రపంచంలో ఇంటర్‌నెట్ వినియోగంలో రెండోస్థానంలో ఉన్న భారత్‌ను విజ్ఞాన సాంకేతిక సమాజంగా మార్చేందుకు డిజిటల్ ఇండియా ద్వారా కృషి చేయనున్నామని పేర్కొన్నారు.
సమావేశంలో ఐకాన్ అధ్యక్షుడు గోరన్ మార్బే స్వాగతోపన్యాసం చేశారు. రానున్న రోజుల్లో సమాజంతో కలిసి పనిచేస్తామని, మరింత మారుమూల ప్రాంతానికి టెక్నాలజీని తీసుకుపోతామని హామీ ఇచ్చారు. భారత్ 22 భాషల్లో డొమైన్లు ఏర్పాటు చేయడం ద్వారా ప్రపంచంలో అత్యధిక భాషల్లో నెట్ వినియోగదారుల హోదాలో భారత్ అగ్రస్థానానికి చేరుకోనుందన్నారు.
అఫిలియాస్‌కు లీడర్‌షిప్ అవార్డు
దేశంలో ప్రసిద్ధి చెందిన డొమైన్ రిజిస్ట్రీ సంస్థ అఫిలియాస్ ఆసియాన్ లీడర్‌షిప్ అవార్డు దక్కించుకుంది. అవార్డును ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జోనాతన్ రాబిన్‌సన్ శనివారం స్వీకరించారు.
డిజిటల్ ఇండియాకు కొత్త రూపం
భారతదేశంలో వేగంగా సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా సుపరిపాలన, పారదర్శకత, జవాబుదారీతనాన్ని తీసుకురావాలని యోచిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈ సదస్సు ద్వారా ప్రయోజనం పొందాలని చూస్తోంది. ఇంటర్‌నెట్ వ్యవహారాల్లో ఇప్పటికీ బలహీనంగా ఉన్న అంశాలను గుర్తించి వాటిలో ముందంజ వేసేందుకు స్వయంగా ఐటి మంత్రి రవిశంకర్ రంగంలోకి దిగారు. రెండు మూడు రోజుల్లో ఐటి దిగ్గజాలతో అవగాహన ఒప్పందాలను కుదుర్చుకునే ఆలోచనలో కేంద్రం ఉంది.

చిత్రం.. హైదరాబాద్‌లోని హైటెక్స్ నోవాటెల్‌లో జరుగుతున్న ఐకాన్ సదస్సును ప్రారంభించి
మాట్లాడుతున్న కేంద్ర కమ్యూకేషన్లు, న్యాయ శాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్