రాష్ట్రీయం

చెరిగిపోని మధుర స్మృతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 30: ఏపిలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ఏర్పాటు చేసే స్నాతకోత్సవాలు, వార్షికోత్సవాలు, కళాశాల దినోత్సవాలు, క్రీడాదినోత్సవాలు మొదలగు ఈవెంట్స్‌ను భారీ ఎత్తున చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ కార్యక్రమాలు విద్యార్థులు జీవితాల్లో మధుర స్మృతులుగా మిగిలిపోయేలా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విశ్వవిద్యాలయాల వైస్-చాన్స్‌లర్లు, కళాశాల ప్రిన్సిపాళ్లు తదితరులకు బుధవారం ఆదేశాలు జారీ చేశారు. స్నాతకోత్సవం ప్రతి విద్యార్థి జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండేలా నిర్వహించాలని ప్రభుత్వం ఈ ఆదేశాల్లో పేర్కొంది. విద్యార్థులు డిగ్రీలు తీసుకుని సమాజంలో అడుగుపెట్టే సమయంలో నిర్వహించే స్నాతకోత్సవం వారిని ప్రేరేపించే విధంగా నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రముఖ శాస్తవ్రేత్తలు, సామాజిక నిపుణులు, పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించి విద్యార్థుల్లో కొత్త ఉత్సాహం కలిగేలా చూడాలని సూచించారు. కేవలం ఒక రోజుకే స్నాతకోత్సవాన్ని పరిమితం చేయకుండా ఎగ్జిబిషన్లు, గ్రూపు చర్చలు నిర్వహించి, విద్యార్థులను, వారి తల్లిదండ్రులను కూడా భాగస్వాములను చేయాలని, కాలేజ్ డే, వార్షికోత్సవం, స్పోర్ట్స్ డేలను నిర్వహించే సమయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులను భాగస్యాములను చేయాలని ఉన్నత విద్యాశాఖ కోరింది. సాంస్కృతిక దినోత్సవాలను నిర్వహించే సమయంలో ఆయా ప్రాంతాల సాంస్కృతిక పద్ధతులకు ప్రాధాన్యత లభించేలా చూడాలని కోరారు. మహిళా దినోత్సవాలను నిర్వహించి, విద్యార్థినులలో నూతనోత్సాహం నింపేలా చూడాలని ఆదేశించారు. కాలేజీ పూర్వ విద్యార్థుల సమ్మేళనాలను నిర్వహించి, కాలేజీ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.