రాష్ట్రీయం

నిద్రపోయిన నిఘా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 5: వ్యవసాయం ప్రధానమైన గుంటూరు కల్తీకి స్వర్గ్ధామమైంది. జిల్లాలో విత్తనాలు, బయో, కారం కల్తీ ఉత్పత్తులపై కొరడా ఝళిపించాల్సిన నిఘా వ్యవస్థ సుఖ నిద్రపోతోంది. ఫలితంగా వందల కోట్ల రూపాయలు రాజకీయ నేతలు, అధికారుల జేబుల్లోకి వెళుతున్నాయి. గుంటూరు జిల్లాలో వ్యవసాయ, విజిలెన్స్ విభాగాల్లో పోస్టింగులకు భారీ డిమాండ్ ఉంటుంది. అంటే ఆదాయం ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఏడాది క్రితం ఒక ప్రముఖుని ఇంట్లో జరిగిన శుభకార్యానికి టార్గెట్లు పెట్టి మరీ వసూళ్లు చేశారన్న ఆరోపణలు ఇప్పటికీ వినిపిస్తుంటాయి.
నకిలీ విత్తనాల ఉత్పత్తి, అమ్మకాలకు అడ్డాగా మారిన రాజధాని జిల్లాలో వాటికి బలైపోయిన రైతాంగం కన్నీళ్లను మీడియా వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ వ్యవహారంలో అధికారపార్టీ ప్రముఖులు, వారి కుటుంబసభ్యుల పాత్ర ఉందన్న ఆరోపణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా దృష్టి సారించారు. అక్రమార్కులపై విచారణ జరపాలని వ్యవసాయ శాఖ కమిషనర్‌ను ఆదేశించగా, ఒక ఏఓను మాత్రం సస్పెండ్ చేసి, పెద్దగద్దలను విడిచిపెట్టారు.
అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాల్సిన విజిలెన్స్ విభాగం ఇప్పటివరకూ తనిఖీలు నిర్వహించిన దాఖలాలు లేవు. నిజంగా ఆ పని చేసి ఉంటే ఇంత భారీ స్థాయిలో నిల్వలు వెలుగుచూసేవి కావు. నకిలీ అమ్మకాలతో నష్టపోయిన రైతాంగం రోడ్డెక్కిన తర్వాత గానీ విజిలెన్స్ విభాగం నిద్రలేవలేదు. నకిలీ బయో కంపెనీల కార్యాలయాలు, డెన్లపై దాడులు చేసి సీజ్ చేశారు.
తాజాగా వెలుగుచూసిన కల్తీ కారం అమ్మకాలపై జరిగిన దాడి, ఇన్నాళ్లూ కళ్లు మూసుకున్న నిఘా వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనం. మిల్లుల్లో దాదాపు 2కోట్ల రూపాయల విలువైన కల్తీకారాన్ని పట్టుకున్నారు. వీటిని ప్రభుత్వ హాస్టళ్లకూ కొనే్నళ్ల నుంచి సరఫరా చేస్తున్నారు. జిల్లాలో 200 యూనిట్లలో కారం ఉత్పత్తి అవుతుండగా, అందులో 70 శాతం కల్తీ ఉత్పత్తులేనని సమాచారం. దానివల్ల అనేక రోగాలు సంక్రమిస్తున్నాయి. హాస్టళ్లకు సరఫరా అయ్యే కారాన్ని కనీసం తనిఖీ కూడా చేయడం లేదంటే, ఏ స్థాయిలో ఈ దందా జరుగుతుందో స్పష్టమవుతోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని నిఘా వ్యవస్థ గాలికి వదిలేసింది. ఇందులో దాదాపు 30 కోట్ల ముడుపులు వివిధ స్థాయి వారికి ముట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
బయో వ్యాపారంలో కూడా నిఘా వ్యవస్థ నిద్రపోతోంది. అసలు నిబంధనల ప్రకారం జెడిఏ స్థాయిలో ప్రతి ఏటా మూడుసార్లు తనిఖీ చేయాలి. ఇటీవల కల్తీ విత్తనాలు, బయోలపై కథనాలు రావడంతో దాడులు చేసి హడావిడి చేశారు. అంటే జెడిఏలు తమ విధి నిర్వహించడం లేదని స్పష్టమవుతూనే ఉంది. గుంటూరు జిల్లాలో తాజాగా 20 నకిలీ బయో కంపెనీలపై చీటింగ్ కేసులు నమోదు చేశారు.
నకిలీ బయో ఉత్పత్తుల వ్యవహారంలో రాజధాని నెంబర్‌వన్‌గా ఉంది. గుంటూరు జిల్లాలోనే 100కు పైగా కంపెనీలున్నట్లు ఒక అంచనా. కేవలం టిన్ నెంబర్‌తో రైతుల ఆశ పెట్టుబడిగా కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. ఇవి కాకుండా న్యూట్రిషన్‌తో కూడిన ఉత్పత్తులు ఇంకోరకమైన దందాగా మారింది.
గుంటూరు, ప్రకాశం జిల్లాకు చెందిన అధికారపార్టీలోని ఇద్దరు ఎమ్మెల్యేలు ఈ వ్యాపారంలో ఇప్పటికే కోట్లకు పడగలెత్తారు. చైనా నుంచి వస్తోన్న ముడిసరుకుపై నిఘా పెట్టడంలోనూ విజిలెన్స్ విఫలమయిందన్న ఆరోపణలు వస్తున్నాయి. లక్షల పెట్టుబడి పెట్టి కోట్లు ఆర్జించే ఈ వ్యవహారంలో, వ్యవసాయశాఖలో పనిచేసే కొందరు ఏఓ స్థాయి నుంచి ఆ పై స్థాయి అధికారులు, మాజీ అధికారులు, బడా రాజకీయ నేతలు వాటాదారులుగా ఉన్నారు.