అంతర్జాతీయం

భారత్ మాకు అత్యంత సన్నిహిత దేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, నవంబర్ 6: భారత దేశం బ్రిటన్‌కు అత్యంత ముఖ్యమైన, సన్నిహిత దేశమని, ప్రపంచంలోని శక్తివంతమైన దేశాల్లో ఒకటని బ్రిటన్ ప్రధాని థెరెసా మే అభివర్ణిస్తూ, తన భారత దేశ పర్యటన ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రాధాన్యతను మరోసారి ధ్రువీకరిస్తుందని చెప్పారు.
బ్రిటన్‌కు వెలుపల తన తొలి ద్వైపాక్షిక పర్యటనకోసం ఆదివారం రాత్రి పొద్దుపోయన తర్వాత ఢిల్లీ చేరుకున్నారు. అంతకుముందు ‘సండే టెలిగ్రాఫ్’ పత్రికలో రాసిన ఒక వ్యాసంలో థెరెసా మే ఈ అభిప్రాయం చేశారు. న్యూఢిల్లీ, బెంగళూరులలో తాను జరిపే మూడు రోజుల పర్యటనలో బ్రిటన్‌ను ఒక మంచి పెట్టుబడులకు అనువైన దేశంగా చూపించడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. ‘మాకు అత్యంత సన్నిహితమైన, ముఖ్యమైన దేశాల్లో భారత్ ఒకటి. అంతేకాక ఒక శక్తివంతమైన దేశం. ఆ దేశంతో మాకు చారిత్రకంగా, సాంస్కృతికంగా విలువలపరంగా ఎంతోకాలంగా సంబంధాలున్నాయి. అంతేకాదు,విప్లవాత్మక సంస్కరణల అజెండాను కొనసాగిస్తున్న ప్రధాని నాయకత్వంలో ఉంది. మరోవిధంగా చెప్పాలంటే బలమైన సంబంధాలు, పరిపక్వమైన బంధం కలిగిన, వాటిని మరింత పటిష్ఠం చేసుకోగల అవకాశం ఉన్న దేశాలు మావి’ అని ఆమె ఆ వ్యాసంలో పేర్కొన్నారు. అందువల్లనే తాను ఈ రోజు ఐరోపాకు వెలుపల తొలి ద్వైపాక్షిక పర్యటనకోసం భారత్‌కు బయలుదేరుతున్నానని, తన వెంట బ్రిటన్‌కు చెందిన ఓ భారీ వాణిజ్యవేత్తల ప్రతినిధి బృందం కూడా వస్తోందని ఆమె చెప్పారు. రెండు దేశాల మధ్య ఇప్పటికే ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి తాను ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటానని ఆమె తెలిపారు. ఈ భాగస్వామ్యం ఇప్పటికే రెండు దేశాలకు ఎంతో ప్రయోజనాలను చేకూర్చిందని కూడా ఆమె చెప్పారు. అంతేకాకుండా ప్రధాని మోదీ విజన్‌లయిన వంద కొత్త స్మార్ట సిటీల నిర్మాణం, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా లాంటి కార్యక్రమాలను నెరవేర్చి రెండు దేశాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ,అభివృద్ధి అవకాశాలను సృష్టించడానికి బ్రిటన్ సరయిన భాగస్వామి అని కూడా ఆమె చెప్పారు. తన పర్యటన సందర్భంగా భారత్‌తో ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంపై ఎలాంటి చర్చలు జరిగే అవకాశం లేదని, బ్రిటన్ అధికారికంగా యూరోపియన్ యూనియన్‌నుంచి వైదొలిగేంతవరకు దీనిపై చర్చలు జరిపే అవకాశం లేదని థెరెసా మే స్పష్టం చేశారు.