ఆంధ్రప్రదేశ్‌

బీసీలకు చేరని కార్పొరేషన్ నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 6: ఒక వైపు బిసి సంక్షేమానికి కేటాయించిన రూ.6వేల కోట్లు మురిగిపోతుంటే మరోవైపు కొన్ని కులాలకు చెందిన ఫెడరేషన్ చైర్లన్లు సన్మానాల కోసం వెంపర్లాడుతున్నారు. బిసిల సంక్షేమం కోసం తెలుగుదేశం ప్రభుత్వం 2016-17 సంవత్సరానికి దాదాపు 9వేల కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ నిధులను బిసి కార్పొరేషన్, కార్పొరేషన్ పరిధిలో పని చేసే మేదర, విశ్వబ్రాహ్మణ, నారుూ బ్రాహ్మణ, రజక, కుమ్మరి వంటి వివిధ బిసి కులాల ఫెడరేషన్‌ల ద్వారా ఖర్చు చేయాల్సి ఉంది. కాని వాస్తవానికి వస్తే కేటాయించిన నిధుల్లో కనీసం 25 శాతం కూడా వినియోగం కాలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా బాధ్యత స్వీకరించిన వివిధ కులాల ఫెడరేషన్ చైర్మన్లు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. కుండలోవి కుండలోనే ఉండాలి పిల్లలు మాత్రం దుడ్డుల్లా ఉండాలన్న చందంగా ప్రభుత్వం పేరుకి వందల కోట్లు బిసి సంక్షేమానికి కేటాయించినట్టు ప్రకటించి, వాస్తవంలో మాత్రం నిధులన్నీ మిగుల్చుకోవాలనే ఆలోచనతో ఉందో? లేక ఫెడరేషన్ చైర్మన్లు సన్మానాల మోజులో పడి పట్టించుకోవడం లేదో అర్థం కాకుండా ఉంది. ఆలస్యంగా బాధ్యతలు స్వీకరించిన ఒక ఫెడరేషన్ చైర్మన్ తన సంఘీయులను అడిగి మరీ సన్మానాలు చేయించుకుంటున్నారు. గుంటూరు సంఘీయులు సన్మానం చేయడానికి తిరస్కరించగా విజయవాడలో మాత్రం ఘనంగానే సన్మానం చేయించుకున్నారు. నిజానికి తెలుగుదేశం పార్టీ ఎన్నికల సమయంలో బిసిల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఏడాదికి రూ.10వేల కోట్లతో యాక్షన్ ప్లాన్ రూపొందిస్తామని ప్రకటించింది. అయితే అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం అది సాధ్యం కాలేదు. 2016-17 సంవత్సరానికి సంబంధించి మాత్రం రూ. 8832 కోట్లు కేటాయించింది. అదే విధంగా కాపు కార్పొరేషన్‌కు రూ.1000 కోట్లు, బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.67కోట్లు కేటాయించింది. ఈ రెండు కార్పొరేషన్లు తమకు కేటాయించిన నిధులు ఖర్చు చేయడంలో దూసుకుపోతున్నాయి. స్వయం ఉపాధి నుంచి విదేశీ చదువుల వరకు వారు యువతకు సహకారం అందిస్తున్నారు. ఈ రెండు కార్పొరేషన్‌లలో దాదాపు 60శాతం నిధులు ఖర్చు చేయగా బిసి కార్పొరేషన్‌కు కేటాయించిన నిధుల్లో 25శాతం కూడా ఖర్చు కావడంలేదు. ఈ నిధులు కూడా విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, హాస్టల్ నిర్వహణకు సంబంధించి ఖర్చు చేసినవే. బిసి కార్పొరేషన్ పరిధిలో కుమ్మరి - శాలివాహన ఫెడరేషన్, విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్, నారుూ బ్రాహ్మణ ఫెడరేషన్, రజక ఫెడరేషన్, వడ్డెర ఫెడరేషన్, సగర ఉప్పర ఫెడరేషన్, కృష్ణ బలిజ ఫెడరేషన్, వాల్మీకి ఫెడరేషన్, భట్రాజు ఫెడరేషన్, మేదర ఫెడరేషన్ వంటి వృత్తి సంఘాల ద్వారా 50శాతం సబ్సిడీగాను, 50 శాతం రుణంగా ఈ నిధులను లబ్ధిదారులు అందచేయాలి. 50 శాతం రుణాలను బ్యాంక్‌ల ద్వారా మిగిలిన 50 శాతం నిధులను ఫెడరేషన్ ద్వారా అందించాల్సి ఉంది. ఇందుకు సంబంధించి లక్ష్యాలను కూడా ఘనంగా నిర్ణయించారు. కాని వాస్తంలో నిర్ణయించిన లక్ష్యానికి అమలు జరిగిన లక్ష్యానికి అసలు పొంతన లేదు. ఉదాహరణకి నారుూ ఫెడ్ ద్వారా కనీసం 10శాతం మందికి కూడా ఆర్థిక సహాయం అందించలేదు.
ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఇటీవల నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఖర్చుకాని బిసి నిధులు గురించి వివరించారు. అభివృద్ధి పనుల విషయంలో ఎంతో బాధ్యతగా వ్యవహరించే ముఖ్యమంత్రి చంద్రబాబు బిసిలకు కేటాయించిన నిధులు ఖర్చు కాకపోయినా, ఫెడరేషన్ చైర్మన్లు బాధ్యతగా వ్యవహరించకపోయినా ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడంలేదు. బిసి కార్పొరేషన్‌కు కేటాయించిన దాదాపు రూ.8వేల కోట్లు ఫెడరేషన్ నాయకులు మొత్తం కలిపి కనీసం రూ.1000 కోట్లు ఖర్చు చేయలేకపోయారు. ఇదే పరిస్థితి కొనసాగితే బిసిల పార్టీగా గుర్తింపు పొందిన తెలుగుదేశం పార్టీపై బిసిలు అసంతృప్తి ప్రకటించే అవకాశం ఉంటుంది. ఆ ప్రభావం రానున్న ఎన్నికల్లో తీవ్రంగా ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.