రాష్ట్రీయం

వరల్డ్ ట్రావెల్ మార్కెట్ లండన్ 2016కు చందులాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 6:తెలంగాణ టూరిజంను ప్రపంచానికి పరిచయం చేసేందుకు వరల్డ్ ట్రావెల్ మార్కెట్ లండన్ 2016ను వేదికగా ఉపయోగించుకుంటామని పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు. వరల్డ్ ట్రావెల్ మార్కెట్ లో పాల్గొనేందుకు వెళ్లిన మంత్రికి ఎన్‌ఆర్‌ఐ టిఆర్‌ఎస్ సెల్ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. జై తెలంగాణ, జై కెసిఆర్ నినాదాలతో లండన్ హీత్రో అంతర్జాతీయ విమానాశ్రయం మారుమ్రోగింది. టూరిజం కార్యదర్శి బూర వెంకటేశం, ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్, అజ్మీరా ప్రహ్లాద్‌లు కూడా మంత్రి వెంట వెళ్లారు. ఈ సదస్సులో 182 దేశాల నుండి యాభై వేలకు పైగా ప్రతినిధులు పాల్గొంటారు. తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలు ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాల్లో మంత్రి పాల్గొని ప్రభుత్వ పథకాలు, బంగారు తెలంగాణ సాధనకు ఎన్‌ఆర్‌ఐల తోడ్పాటు తదితర అంశాలపై చర్చిస్తారు. లండన్‌లో మంత్రికి స్వాగతం పలికిన వారిలో ఎన్‌ఆర్‌ఐ టిఆర్‌ఎస్ అధ్యక్షుడు అనిల్ కుర్మాచలం, ప్రధాన కార్యదర్శి అశోక్ గౌడ్ దూసరి, కార్యదర్శులు నవీన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి తదితరులు ఉన్నారు.