రాష్ట్రీయం

లక్షణంగా యాదాద్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 7: యాదాద్రికి లక్షమంది భక్తులు ఒకేరోజు వచ్చినా సాఫీగా దర్శనం జరిగేలా, అందరికీ వసతి సౌకర్యాలు లభించేలా ఏర్పాట్లు చేపట్టాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో సోమవారం యాదాద్రి అభివృద్ధి పనులపై సమీక్ష జరిపారు. తితిదే ఏర్పాటు చేసిన తరహాలోనే యాదాద్రి టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ (వైటిడిఏ) ఆధ్వర్యంలో మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. యాదాద్రికి ఇటీవలకాలంలో భక్తుల సంఖ్య బాగా పెరిగిందని, సెలవు రోజుల్లో, ప్రత్యేక సందర్భాల్లో లక్ష మందికిపైగా భక్తులు వస్తున్నారన్నారు. పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా సాఫీగా దర్శనం, అందరికీ మంచి వసతి లభించేలా చర్యలు తీసుకోవాలని, ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా యాదాద్రికి నాలుగు వైపుల నాలుగు లేన్ల రోడ్లు నిర్మించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రధాన గుట్టకు అభిముఖంగా అన్ని సౌకర్యాలతో కూడిన కాటేజీలను నిర్మించాలన్నారు. ఈశాన్య భాగంలో 13 ఎకరాల విస్తీర్ణంలో ప్రసిడెంట్ సూట్ నిర్మించాలన్నారు. ప్రస్తుతం ఉన్న బస్టాండ్, బస్ డిపోను మరో చోటికి మార్చాలని ఆదేశించారు. అలాగే పోలీస్, ఫైర్, వైద్య సేవలను అత్యవసరంగా భావించి మెరుగు పర్చాలన్నారు. యాదాద్రిని గొప్పగా తీర్చిదిద్దడానికి అవసరమైన నిధులు కేటాయించాం. కావాల్సినంత భూమి సేకరించాం. ఇక మంచి ప్రణాళికతో నిర్మాణాలు చేపట్టడమే మిగిలిందన్నారు. అనేక ప్రత్యేకతలు, విశిష్టతలతో దేశంలోనే గొప్ప దేవాలయంగా యాదాద్రిని మార్చడానికి దేశంలోని ప్రముఖ ఆలయాలలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, సేవలను అధ్యయనం చేయాలని ఆదేశించారు. అధికారులు, ఆలయ నిర్మాణ శిల్పులు, రూపకర్తలు వివిధ ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలని సూచించారు. లక్ష్మినరసింహస్వామికి 32 అవతారాలు ఉన్నాయి. అన్ని అవతారాలు యాదాద్రిలో ఉండాలని, వాటిని ఎక్కడ ప్రతిష్టించాలనే విషయంపై ఆధ్యాత్మికవేత్తల సలహాతీసుకోవాలన్నారు. యాదాద్రిలో అభివృద్ధి చేసే వివిధ ప్రదేశాలకు దైవ నామాలను పెట్టుకోవడం వల్ల భక్తులు అన్యాపదేశంగా కూడా దైవ నామ స్మరణ చేస్తారన్నారు. ఏ విభాగానికి ఏ పేరు పెట్టాలనే నిర్ణయం తీసుకోవాలని, ఆలయ ప్రాంగణమంతా దైవ స్త్రోత్రాలు, కీర్తనలు వినిపించేలా సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలన్నారు. యాదాద్రిపైకి వెళ్లడానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని, పైకి వెళ్లడానికి, కిందకు రావడానికి వేర్వేరు మార్గాలు ఉండాలన్నారు. దేవాలయ అభివృద్ధి పనులకు గుట్టపైనా, కింద వ్యాపారం చేసుకునే వారూ సహకరించాలని సిఎం కోరారు. వారి జీవనోపాధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి, వారికి గదులు కేటాయించాలని సిఎం సూచించారు. యాదాద్రిలో అభివృద్ధి పనుల కోసం అటవీ శాఖ నుంచి సేకరించిన 85 ఎకరాలను సద్వినియోగం చేసుకునే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు.

చిత్రం.. యాదాద్రి అభివృద్ధిపై జరిపిన సమీక్షలో మాట్లాడుతున్న కెసిఆర్