రాష్ట్రీయం

సచివాలయానికే రానప్పుడు వాస్తు భయం ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 7: సచివాలయానికే రాని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు వాస్తు భయం ఎందుకూ? అని తెలంగాణ ఉద్యమ వేదిక నాయకులు డాక్టర్ చెరుకు సుధాకర్, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. వాస్తు బాగా లేదన్న భావనతో సచివాలయంలోని భవనాలను కూల్చి వేయించి కొత్తగా నిర్మించాలనుకోవడం సమంజసం కాదని వారు సోమవారం విలేఖరుల సమావేశంలో అన్నారు. ఫాం హౌస్‌లో కూర్చుని పాలన చేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్‌కు సచివాలయంలోని పటిష్టంగా ఉన్న భవనాలను కూల్చి వేయించి సుమారు 350 కోట్ల రూపాయల ప్రజాధనంతో కొత్తగా నిర్మించాలని ఆలోచన చేయడం భావ్యం కాదని వారన్నారు. ప్రధానికి కూడా లేని విధంగా క్యాంపు కార్యాలయాన్ని నిర్మించాలని కెసిఆర్ భావిస్తున్నారని వారు విమర్శించారు. ఖమ్మం తదితర ఏజెన్సీ ప్రాంతాల్లో డెంగ్యూ వంటి విష జ్వరాలతో అనేక మంది మృత్యువాత పడుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రులుగా చేసిన వారు ఇటువంటి పరిస్థితుల్లో ఆయా ప్రాంతాలను సందర్శించి, వారికి మనోధైర్యం కల్పించేందుకు అక్కడే వారితో రాత్రిళ్ళు ఉండేవారని ఉదహరించారు. ప్రస్తుత వైద్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఏమీ పట్టించుకోవడం లేదని వారు విమర్శించారు.