రాష్ట్రీయం

నిఖిల్‌కు మళ్లీ వైద్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 7: ఎత్తు పెంచేందుకు శస్తచ్రికిత్స చేయించుకున్న నిఖిల్‌రెడ్డికి ఎట్టకేలకు గ్లోబల్ ఆసుపత్రి వైద్యులు వైద్యం అందిస్తున్నారు. నిఖిల్‌రెడ్డి కాళ్లకు చేసిన ఆపరేషన్ అనైతికంగా జరిగిందని, వైద్యుడు చంద్రభూషణ్‌ను తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ రెండేళ్లపాటు సస్పెండ్ చేసింది. దీంతో నిఖిల్‌కు గ్లోబల్ ఆసుపత్రి వైద్యసేవలు నిలిపివేసింది. దీంతో ఆసుపత్రి ఎదుటు నిఖిల్ తండ్రి గోవర్ధన్‌రెడ్డి, కుటుంబీకులు ఆదివారం ఆందోళనకు దిగిన విషయం విధితమే. తన కొడుకుకు వైద్యులు చేసిన ఆపరేషన్ అనైతికమని, న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తానని నిఖిల్ తండ్రి గోవర్ధన్‌రెడ్డి హెచ్చరించిన నేపథ్యంలో గ్లోబల్ ఆసుపత్రి యాజమాన్యం స్పందించింది. సోమవారం నిఖిల్‌కు వైద్య సేవలు ప్రారంభించింది. దీంతో నిఖిల్ కుటుంబీకులు సంతోషం వ్యక్తం చేశారు. నిఖిల్‌కు వైద్యం చేస్తున్న డాక్టర్ అనంత్‌పాయ్ మాట్లాడుతూ, నిఖిల్ ఆపరేషన్ సక్సెస్ అయిందని, త్వరలో నిఖిల్ కోలుకుంటాడని డాక్టర్ తెలిపారు. అయితే డాక్టర్ వ్యాఖ్యలను నిఖిల్ తండ్రి గోవర్ధన్‌రెడ్డి ఏకీభవించడం లేదు. ఆపరేషన్ తరువాత తమ కొడుకు రోజూ నరకం అనుభవిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తన కొడుకు అనుభవిస్తున్న బాధ మరెవరికీ రాకూడదని, తన పోరాటం కొనసాగుతుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ అనంత్‌పాయ్ మీడియాతో మాట్లాడుతూ నిఖిల్‌కు పూర్తిస్థాయి వైద్యం అందుతుందని, ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని చెప్పారు. ఇప్పటి వరకు డాక్టర్ చంద్రభూషణ్, నిఖిల్‌కు వైద్యం అందించారని, వారంలో ఒకట్రెండు సార్లు ఇంటికి వెళ్లి చూసే వారని, గత నెల 27న డాక్టర్ చంద్రభూషణ్ చివరి సారిగా విజిట్ చేశారని, ఇప్పుడు ఆయనను మెడికల్ కౌన్సిల్ సస్పెండ్ చేసిందని డాక్టర్ అనంతపాయ్ వివరించారు.

చిత్రం.. నిఖిల్‌రెడ్డి