రాష్ట్రీయం

ఆలయాల పునరుద్ధరణకు బృహత్తర కార్యక్రమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/బేగంపేట, డిసెంబర్ 30: తెలుగు రాష్ట్రాలలో ఆదరణ, పర్యవేక్షణ కరవై కళాహీనంగా మారిన దేవాలయాలతోపాటు నిత్య ధూప దీప నైవేద్యాలకు నోచుకోని ఆలయాల పునరుద్ధరణకు పుష్పగిరి పీఠం శ్రీకారం చుట్టనున్నట్టు పీఠాధిపతి విద్యాశంకర భారతి మహాస్వామి తెలిపారు. బుధవారం బేగంపేటలోని పుష్పగిరి పీఠంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆలయాల్లో పవిత్రత, పరిశుభ్రత పాటించేలా భక్తులలో, నిర్వాహకులలో, అర్చకులలో చైతన్యం తీసుకువచ్చేందుకు ఈ కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు.
పుష్పగిరి పీఠం అధీనంలోవున్న దేవాలయాలతోపాటు ఇతర దేవాలయాలపైనా దృష్టి సారిస్తామన్నారు. ప్రాచీన దేవాలయాలకు పూర్వవైభవం తీసుకువచ్చేలా ఓ భారీ పథకాన్ని రూపొందించినట్లు స్వామి తెలిపారు.నూతన ఆంగ్ల సంవత్సరం, మకర సంక్రాంతి సందర్భంగా సకల జనావళికి శుభాశీస్సులు తెలుపుతున్నట్లు విద్యా శంకర భారతి మహాస్వామి తెలిపారు. ఆంగ్ల సంవత్సరం అనగానే డిసెంబర్ 31వ తేదీ అర్థరాత్రి కేరింతలు కొడుతూ, బాణా సంచా వెలిగిస్తూ ఆనందోత్సవాల మధ్య గడుపుకోవడం ఓ అలవాటుగా మారిపోయిందని స్వామి తెలిపారు.
అలాకాకుండా డిసెంబర్ 31 రాత్రినుంచి వేకువజామువరకు తమ సమీపంలో ఉన్న దేవాలయాలలో గడపాలని కోరారు. అర్థరాత్రి దేవాలయాల పరిసరాలను పరిశుభ్రం చేయాలన్నారు. వేకువజామునే స్నానాలు ముగించుకుని దేవాలయానికి వెళ్లి భగవద్ధర్శనం చేసుకుని వీలైతే పేదలకు అన్నదానం చేయాలని పిలుపునిచ్చారు.

బేగంపేట పుష్పగిరి పీఠంలో బుధవారం
విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న
విద్యాశంకర భారత మహాస్వామి