రాష్ట్రీయం

కన్నుల పండువగా పుష్పయాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 7: పవిత్ర కార్తీక మాసంలో శ్రవణా నక్షత్రం రోజున తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతిఏటా నిర్వహించే పుష్పయాగ మహోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. సుగంధ సువాసనలు వెదజల్లే 12 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీ మలయప్పస్వామికి వేడుకగా పుష్పార్చన నిర్వహించారు. రంగురంగుల పుష్పాలు, పత్రాల మధ్య స్వామి, అమ్మవార్ల వైభవం అద్భుతంగా సాగింది. తమిళనాడు నుంచి 3టన్నుల పుష్పాలను, కర్ణాటక నుంచి 3 టన్నులు, ఆంధ్ర, తెలంగాణ నుంచి 1 టన్ను పుష్పాలను భక్తులు విరాళంగా ఇచ్చారు. శ్రీవారి ఆలయంలో రెండో అర్చన, రెండో గంట, నైవేద్యం వేళలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవర్లను సంపంగి ప్రాకారంలోని కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన యాగశాలకు వేంచేపు చేయించారు. అనంతరం రుత్విక్కులు వేదోక్తంగా శ్రీవిష్ణు గాయత్రి మహామంత్రాలను ఉచ్చరిస్తూ 108 సార్లు హోమం చేశారు. అనంతరం స్వామివారికి కంకణాలను ధరింపచేసి హోమ తిలకధారణ చేశారు. చివరగా పంచామృతంతో అభిషేకం చేసి చందనలేపనాన్ని చేసి తులసి మాలను ధరింపచేసి నక్షత్ర హారతిని నివేదించారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల నడుమ శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం జరిగింది. మధ్యాహ్నం 1నుంచి 5 గంటల వరకు పుష్పయాగ మహోత్సవం కన్నుల పండువగా సాగింది. స్వామి, అమ్మవార్లను పట్టువస్త్భ్రారణాలతో అలంకరించి వేద మంత్రోచ్ఛరణ నడుమ పుష్పకైంకర్యం చేశారు. చామంతి, సంపంగి, నూరు వరహాలు, రోజా, గనే్నరు, మల్లి, మొల్లలు, కనకాంబరం, తామరకలువ, మొగలిరేకులు, మానుసంపంగి పుష్పాలు, తులసి, మరువం, ధవణం, బిల్వం, పన్నీరు, కదిరిపచ్చ పత్రాలతో స్వామి, అమ్మవార్లను అర్చించారు. అనంతరం స్వామివారు తన దేవేరులతో కలిసి బంగారుతిరుచ్చిని అధిరోహించి రాజలాంఛనాలతో ఆనంద నిలయంలోకి ప్రవేశించడంతో శ్రీవారి పుష్పయాగం నేత్రపర్వంగా ముగిసింది. ఈకార్యక్రమంలో టిటిడి ధర్మకర్తల మండలి చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, ఇ ఓ డాక్టర్ డి.సాంబశివరావు, ధర్మకర్తల మండలి సభ్యులు ఎ.వి రమణ, ఆలయ డిప్యూటీ ఇ ఓ కోదండరామారావు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. తిరుమలలో సోమవారం మలయప్పస్వామికి పుష్పయాగం నిర్వహిస్తున్న పూజారులు