రాష్ట్రీయం

ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంషాబాద్, నవంబర్ 7: త్రిదండి చిన జీయర్ స్వామిని సోమవారం ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ఆర్ట్ ఆఫ్ లీవింగ్ సంస్థ వ్యవస్థాపకులు రవిశంకర్ కలిశారు. ముచ్చింతల్‌లోని జీయర్ ఆశ్రమానికి వచ్చిన ఆయన జీయర్‌తో కాసేపు ముచ్చటించారు. షష్టిపూర్తి జరుపుకున్న జీయర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు ఆయన సాతంరాయి సమీపంలోని ఎంఎస్ కనె్వన్షన్‌లో జరిగిన రుద్రాభిషేకం కార్యక్రమంలో పాల్గొని పూజలు జరిపారు. ఆధ్యాత్మిక మార్గంలో పయనించడంతో పాటు ధర్మాన్ని నిర్వర్తించడంలో నిర్లక్ష్యం చేయరాదన్నారు. ధ్యానం జీవితంలో అంతర్భాగంగా మారాలన్నారు. కార్యక్రమానికి వేలాది మంది భక్తులతో పాటు విద్యార్థులు హాజరయ్యారు. శివనామస్మరణలో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణంతో వెల్లివిరిసింది.

చిత్రం.. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్‌ను
శాలువా కప్పి సన్మానించిన చిన జీయర్ స్వామి