రాష్ట్రీయం

సెట్‌టాప్ బాక్సుల ఏర్పాటుకు గడువు పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 30: తెలంగాణ రాష్ట్రంలో సెట్ టాప్ బాక్స్‌ల ఏర్పాటుకు రెండు నెలల గడువు పెంచుతూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతవరకు ఏ ఒక్కరికీ ప్రసారంలో అంతరాయం లేకుండా చూడాలని సంబంధిత అధికారులను హైకోర్టు జడ్జి జస్టిస్ అఫ్జుల్‌పుర్కర్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ఎంఎస్‌ఓల ఫెడరేషన్ దాఖలు చేసిన పిల్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీ చేసింది. పిటీషనర్ తరఫున హాజరైన న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ తగినన్ని సెట్ టాప్ బాక్స్‌లు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదని అన్నారు. బాక్స్‌ల కొరత కారణంగా కేవలం 16 శాతం మంది మాత్రమే అమర్చుకున్నారని, మిగిలినవారికి అందుబాటులోకి రావాల్సి ఉందని న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. ఒక వేళ కేంద్రం గానీ ప్రసారాలను నిలిపివేస్తే 85 శాతం మంది ఇబ్బంది పడతారని అన్నారు. తాము డిజిటల్ అడ్రస్సబుల్ సిస్టమ్ ఏర్పాటుకు ఏమాత్రం వ్యతిరేకం కాదని, అయితే సెట్ టాప్ బాక్స్‌లు సరిపడా అందుబాటులో లేనందున ఆచరణ సాధ్యం కాదని కోర్టు దృష్టికి తెచ్చారు. వాదనలు విన్న న్యాయమూర్తి పిటీషనర్ విన్నపంపై కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ ఈ కేసును నాలుగు వారాలకు వాయిదా వేశారు. ఎపి ప్రభుత్వం తరఫున కూడా ఇదే తరహా అభ్యర్థన కోర్టు ముందుకు వెళ్లింది. మూడో దశ డిజిటలైజేషన్ పూర్తి చేసేందుకు ఆలస్యం అవుతుందన్న అభ్యర్థనను ఎపి ప్రభుత్వం కోర్టు దృష్టికి తెచ్చింది. ఈ అభ్యర్థన గురువారం కోర్టు పరిశీలనకు వస్తుంది.