రాష్ట్రీయం

సర్పంచ్ కిడ్నాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, నవంబర్ 8: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా మదారి గ్రామానికి చెందిన సర్పంచ్ భీమా, మరో ఇద్దరు మహిళలను మావోయిస్టులు సోమవారం అర్ధరాత్రి కిడ్నాప్ చేశారు. మదారి గ్రామంలోకి సాయుధులైన మావోయిస్టులు వచ్చి భీమాతో పాటు మరో ఇద్దరు మహిళలను నిద్రలేపి తమ వెంట అడవుల్లోకి తీసుకెళ్లారు. వీరు పోలీసులకు ఇన్‌ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారని మావోయిస్టులు ఆరోపిస్తూ కిడ్నాప్ చేసినట్లుగా గ్రామస్థులు తెలిపారు. ఇదిలా ఉంటే సర్పంచ్ భీమా మావోయిస్టుల చెర నుంచి తప్పించుకుని పారిపోయి వచ్చాడు. తీవ్ర గాయాలతో ఉన్న భీమాను మంగళవారం బచేలి ఆసుపత్రిలో చేర్పించి పోలీసులు చికిత్స అందిస్తున్నారు. కాగా మావోయిస్టుల చెరలో ఉన్న మరో ఇద్దరు మహిళల కోసం పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఇదే రాష్ట్రంలోని కాంకేర్ జిల్లా ఆమ్‌బేడా పోలీస్‌స్టేషన్ పరిధిలో కుదూర్ గ్రామంలో మావోయిస్టులు ఇన్‌ఫార్మర్ అనే నెపంతో గ్రామస్థుడిని నరికి చంపారు. ఏఓబిలోని చిత్రకొండ ఎన్‌కౌంటర్‌లో గాయపడి తప్పించుకు పోయిన ధనపతి అనే మహిళా నక్సలైట్ మంగళవారం ఒడిశాలోని కలిమెల పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయింది. గాయపడి ఇంటికి వచ్చిన ధనపతి కుటుంబ సభ్యుల సాయంతో పోలీసుల ఎదుట లొంగిపోగా ఆమెకు చికిత్స చేయిస్తున్నారు.