రాష్ట్రీయం

సింగరేణిలో ఎన్నికల శంఖారావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, నవంబర్ 8: సింగరేణి కొత్తగూడెం ఏరియాపరిధిలో ఉన్న వికె-7 ఇంక్లైన్ భూగర్భగని వద్ద మంగళవారం గుర్తింపు సంఘమైన టిబిజికెఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు, టిబిజికెఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలతో సింగరేణి యాజమాన్యం వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో రాబోయే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా టిబిజికెఎస్ ఎంపి కవితను కొత్తగూడెం గనుల్లో పర్యటించాలని కోరుతూ పరోక్షంగా ఎన్నికల కదనరంగంలోకి దిగింది. దీనికి నిదర్శనంగా ఎంపి కవిత కూడా వికె-7 ఇంక్లైన్ వద్ద జరిగిన సభలో మాట్లాడుతూ సరిహద్దులో సైనికులతో సింగరేణి కార్మికులను పోల్చుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎలాంటి షరతులు లేకుండా వారసత్వ ఉద్యోగాలను ఇవ్వాలని సింగరేణి యాజమాన్యానికి ఆదేశాలను జారీచేయడం, ఈ ఆదేశాలను పాటిస్తూ యాజమాన్యం వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తూ ప్రకటించారన్నారు. అయితే ఈ సంవత్సరం అక్టోబర్ 11నాటికి విధులు నిర్వహిస్తున్న కార్మికులకు వర్తింపచేయడాన్ని రాజకీయం చేసే ప్రయత్నాలను సైంధవులు, శనిగ్రహాలు చేస్తున్నాయని వాటిపట్ల సింగరేణి కార్మికవర్గం అప్రమత్తంగా ఉండాలని కోరారు. మొత్తంగా ఒకటి రెండు శాతం ఇబ్బంది కలిగినా మిగిలిన 98 శాతానికి న్యాయం జరుగుతుందన్న విషయం గుర్తించాలని కోరారు. సింగరేణిలో ఉన్న మిగతా సమస్యలను కూడా పరిష్కరించడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి చేస్తారని అన్నారు. రాబోయే గుర్తింపు సంఘం ఎన్నికలలో బాణం గుర్తుపై ఓటువేసి టిబిజికెఎస్‌ను మరోసారి అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు జలగం వెంకటరావు, నల్లాల ఓదెలు, పాయం వెంకటేశ్వర్లు, మాజీ ఎంపి వివేక్‌లు కూడా ప్రసంగిస్తు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలలో టిబిజికెఎస్‌ను గెలిపించాలని కోరారు.
చిత్రం.. వికె-7 ఇంక్లైన్ భూగర్భగని వద్ద ప్రసంగిస్తున్న ఎంపి, టిబిజికెఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత