రాష్ట్రీయం

ఇదే మొదటిసారి కాదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 8: భారత ఆర్ధిక వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే నల్లధనం నిరోధం కోసం అనేక చర్యలు చేపట్టిన నేపథ్యంలో 500 రూపాయలు, వెయ్యి రూపాయల నోట్లు మంగళవారం అర్ధరాత్రి నుండి రద్దు చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించి అందరినీ దిగ్భ్రమకు గురిచేశారు. నిజానికి చెలామణిలో ఉన్న కరెన్సీ నోట్లను రద్దు చేయడం ఇదే మొదటిసారి కాదు. 1946 జనవరిలో తొలిసారి భారత రిజర్వు బ్యాంకు వెయ్యి రూపాయల నోట్లు, 10వేల రూపాయల నోట్లను రద్దు చేసింది. ఆ తర్వాత 1954లో వెయ్యి, 5వేలు, 10వేల నోట్లను కొత్తగా ఆర్బీఐ ప్రవేశపెట్టింది. 1978 జనవరిలో 10వేలు, ఐదు వేలు, వెయ్యి నోట్లను అప్పటి ప్రభుత్వం రద్దు చేసింది. ఆ తర్వాత మళ్లీ చెలామణిలో ఉన్న కరెన్సీ నోట్లను రద్దు చేయడం ఇదే తొలిసారి. అవినీతిని, నల్లధనాన్ని నిర్మూలించేందుకు, పేదరికంపై ఉగ్రవాదంపై పోరాటం చేసేందుకు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. రద్దుచేసిన రూ.500, వెయ్యినోట్ల స్థానంలో కొత్తగా 500 రూపాయల నోట్లు, రెండు వేల రూపాయిల నోట్లు జారీ చేస్తున్నట్టు చెప్పారు.