రాష్ట్రీయం

పారిశుద్ధ్యంపై 5నుంచి సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 30: దేశంలోని 22 రాష్ట్రాల రాజధాని నగరాలు, పది లక్షల కన్నా ఎక్కువ జనాభా కల్గిన మరో 53 నగరాల్లో స్వచ్ఛ భారత్‌పై జనవరి 5వ తేదీ నుంచి ప్రత్యేక సర్వే నిర్వహించనున్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, స్వచ్ఛ భారత్ మిషన్ సంయుక్త కార్యదర్శి శుభా ఠాకూర్ వెల్లడించారు. ఈ మేరకు ఆమె బుధవారం జిహెచ్‌ఎంసిని సందర్శించి, వివిధ ప్రాంతాల్లో బల్దియా చేపడుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. అనంతరం జిహెచ్‌ఎంసిలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ జనవరి 5వ తేదీ నుంచి దేశంలోని 75 రాష్ట్రాల్లో ఘన వ్యర్థాల నియంత్రణపై ప్రత్యేక సర్వే నిర్వహించి, 25న ర్యాంకులను ప్రకటించనున్నట్లు తెలిపారు. ఒకటో తేదీనుంచి 15 వరకు దేశవ్యాప్తంగా స్వచ్ఛ్భారత్‌పై స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం కింద రోడ్లపై, ఫ్లై ఓవర్లపై, ఫుట్‌పాత్‌లపై పేరుకుపోయిన చెత్తను తొలగించనున్నట్లు ఆమె తెలిపారు. 2019 కల్లా స్వచ్ఛ భారత్‌ను సాధించే దిశగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా 1.04 కోట్ల వ్యక్తిగత మరుగుదొడ్లు, 2.52 లక్షల సామాజిక మరుగుదొడ్లు, 2.56 కోట్ల ప్రజా మరుగుదొడ్లను నిర్మించే సంకల్పంతో ఉన్నట్లు తెలిపారు. స్వచ్ఛ్భారత్ సాధనలో ఘన వ్యర్థాల నియంత్రణ అనేది చాలా ముఖ్యమైందని, ఈ విషయంలో హైదరాబాద్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేందుకు వీలుగా ప్రతి ఇంటికి రెండు డస్ట్‌బిన్లను పంపిణీ చేయటం శుభ పరిణామం అన్నారు. దీనిపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజల ఆలోచనా దృక్పథాన్ని మార్చడమే అతి ప్రధానమైన సవాల్ అని ఆమె వ్యాఖ్యానించారు. స్వచ్ఛ హైదరాబాద్ దిశగా అడుగులు వేస్తున్న హైదరాబాద్‌కు కేంద్రం తరపున సంపూర్ణ సహకారం ఉంటుందని వివరించారు. పారిశుద్ధ్యం విషయంలో నగరాల మధ్య సుహృద్భావ పోటీతత్వాన్ని పెంచాలనే ఉద్దేశంతో స్వచ్ఛ్భారత్ కార్యక్రమం ప్రారంభమైన తర్వాత నిర్వహిస్తున్న మొట్టమొదటి సర్వే ఇదేనని తెలిపారు. సర్వే అనంతరం ర్యాంకులను ‘మై గవర్నమెంట్’ వెబ్‌సైట్‌లో పొందుపర్చనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ అదనపు కమిషనర్ రవికిరణ్, సుధాకర్, రమణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

జిహెచ్‌ఎంసిలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో
మాట్లాడుతున్న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి శుభాఠాకూర్, జిహెచ్‌ఎంసి అధికారులు