ఆంధ్రప్రదేశ్‌

ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 9: శాశ్వతంగా రాష్ట్ర ప్రజల హృదయాల్లో ఉండిపోవటానికే తాను రాత్రి పగలు శ్రమిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలకు చేపట్టటమేగాక వాటిని అర్హులందరికీ చేరేలా నిరంతరం శ్రమిస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గ్రామీణ పట్టణ పేద ప్రజానీకాన్ని ఉత్తమ ఆరోగ్యసేవలను అందించాలనే కృత నిశ్చయంతో తాను పనిచేస్తున్నానని అంటూ ఇందుకోసం కార్పొరేట్ వైద్య సంస్థలు కూడా ప్రభుత్వంతో చేయి చేయి కలపాలన్నారు.
విజయవాడ నగర శివారు జక్కంపూడి హౌసింగ్ కాలనీలో దాదాపు రూ.250 కోట్ల వ్యయంతో నిర్మించిన కమ్యూనిటీ హాలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, నైపుణ్య అభివృద్ధి శిక్షణ కేంద్రం, ఆరోగ్య కేంద్రం ఇతర వౌలిక సదుపాయాలకు చంద్రబాబు బుధవారం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఈ కాలనీలో పేదలకు, ఆక్రమణదారుల పునరావాసం కోసం 269 బ్లాకులలో 8608 గృహాల నిర్మాణం చేపట్టగా ఇప్పటికే 7872 గృహాలు పూర్తికాగా, 7570 కుటుంబాలకు వీటిని కేటాయించామన్నారు. ఈ కాలనీ వాసుల అభీష్టం మేరకు ఇప్పటికే వెలసిన మద్యం దుకాణాలన్నీ తక్షణం తొలగిస్తామని, ఎక్కడా బెల్ట్ షాపులు రాకూడదంటూ వేదికపైనుంచే అధికారులను ఆదేశించారు. మత సామరస్యానికి స్ఫూర్తి కాగా మసీదు , దేవాలయాలు, చర్చిలను ప్రభుత్వమే నిర్మిస్తుందన్నారు.
అపోలో సంస్థ ఆధ్వర్యంలో రూ.75 లక్షల వ్యయంతో ఏర్పాటైన ముఖ్యమంత్రి పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన చంద్రబాబు మాట్లాడుతూ రాబోయే కాలంలో ఇదే తరహాలో 200 పట్టణ ఆరోగ్య కేంద్రాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురాగలనన్నారు. జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ నిర్దేశాల కనుగుణంగా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రజలకు ఉత్తమ చికిత్స అందించగలమన్నారు. ప్రతి మండల ప్రధాన కేంద్రంలో ఇలాంటి ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయాలంటూ అధికారులను ఆదేశించారు. అపోలో ఆసుపత్రుల జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ కొండా సంగీత రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు మంచి సంకల్పంతో, పారదర్శకత, ఉత్తమ నాయకత్వ లక్షణాలతో ప్రతి ఒక్కరికీ ఆరోగ్య సంరక్షణ కల్పించాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నందున తాము కూడా భాగస్వాములు అవుతున్నామన్నారు.
ఈ సభలో మంత్రులు డా.కామినేని శ్రీనివాస్, దేవినేని ఉమామహేశ్వరరావు, పి.నారాయణ, ఎంపి కేశినేని శ్రీనివాస్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, కలెక్టర్ బాబు ఎ, మేయర్ కోనేరు శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండియన్ పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

చిత్రం... జక్కంపూడిలో స్కూలు భవనం శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న చంద్రబాబు
కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభించి మహిళలతో ముచ్చటిస్తున్న చంద్రబాబు