రాష్ట్రీయం

ధర నిర్ణయించకపోతే ‘పాత’రే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమండ్రి, డిసెంబర్ 30: గనుల శాఖ ఆధ్వర్యంలో టెండర్లు పిలవటం ద్వారా ఇసుక రీచ్‌లకు వేలం విధానాన్ని ఫిబ్రవరి 1నుండి అమలుచేయాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించిన నేపథ్యంలో అందరి దృష్టి పాత ఇసుక విధానంపై పడింది. ఈ విధానంలో రాష్ట్రప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం సక్రమంగా వసూలుకానప్పటికీ, వినియోగదారులు మాత్రం ఇప్పుడున్న ధర కన్నా తక్కువకే ఇసుకను కొనుగోలు చేయగలిగారు. ప్రస్తుతం మహిళా పొదుపు సంఘాల ద్వారా ఇసుక తవ్వకాలు, అమ్మకాలు సాగిస్తున్న విధానంలో రాజకీయ జోక్యం పెరిగిపోవటంతో పాటు, రాష్ట్రప్రభుత్వానికి లభిస్తున్న ఆదాయం కన్నా, పక్కదారిపట్టిన ఆదాయం చాలా ఎక్కువ. అలాగని వినియోగదారులకు సక్రమంగా ఇసుక లభిస్తోందా? అంటే అదీ లేదు. మీసేవ కేంద్రాల్లో చెల్లించిన 15రోజులకు గానీ ఇసుక లభించకపోగా, పాత విధానంలో కన్నా రెండున్నర రెట్లు కొన్ని సార్లు అంతకన్నా ఎక్కువ ధరపెట్టి ఇసుకను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో అందరి చూపు ఇపుడు పాత ఇసుక విధానంపైనే ఉంది. అయితే పాత ఇసుక విధానంలో కూడా లోపాలు ఉండటంతో, వాటిని సరిచేస్తే తప్ప టెండర్లు ద్వారా ఇసుక తవ్వకాలు, అమ్మకాలు విధానం విజయవంతం కాదని నిర్మాణరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పాత ఇసుక విధానాన్ని బాగా దెబ్బతీసింది ఇసుక కాంట్రాక్టర్ల సిండికేట్ వ్యవస్థ. వేలంలో రీచ్‌లను దక్కించుకున్న వారంతా రింగై, తమ కనుసన్నల్లో ఇసుక తవ్వకాలను, అమ్మకాలను సాగించారు. దాంతో కృత్రిమ కొరత తలెత్తి, కొన్నిసార్లు ధరను నియంత్రించలేని పరిస్థితి ఏర్పడేది. వేలంలో కొన్ని రీచ్‌ల కోసం ఎవరూ ముందుకు రాకుండా చేయటం ద్వారా, మిగిలిన రీచ్‌ల్లోని ఇసుకకు ఎక్కువ డిమాండ్ వచ్చేలా సిండికేట్లు వ్యవహరించాయి.
వేలంలో దక్కించుకున్న రీచ్‌లకు సొమ్ము చెల్లించకుండా, మరొకరు వాటికి దరఖాస్తుచేయకుండా సిండికేట్లు అడ్డుకునేవి. ఒకవేళ ఎవరైనా ముందుకొస్తే వారికి సిండికేట్లు ఇబ్బందులు కలిగించేవి.
టెండర్ల ద్వారా వేలం నిర్వహించిన ఇసుక రీచ్‌ల్లో ఇసుక ధరను రాష్ట్రప్రభుత్వం నిర్ణయించకపోతే నియంత్రణ కష్టమవుతుంది. 2010లో కొంతమంది ఇసుక రీచ్‌ల లీజుదారులు ఇసుక ధర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. కోట్లు పెట్టి ఇసుక రీచ్‌ను వేలంలో దక్కించుకున్న తరువాత, ఇసుకను రాష్ట్రప్రభుత్వం నిర్ణయించిన ధరకే అమ్మాలంటే సాధ్యంకాదని, తమకు నచ్చిన ధరను నిర్ణయించుకుని ఇసుక అమ్ముకుంటామని లీజుదారులు అప్పట్లో హైకోర్టుకు విన్నవించారు. దాంతో ధర నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసింది. ఈసారి కూడా అలాగే ధర నిర్ణయాన్ని రీచ్‌ల లీజుదారులకే కట్టబెడితే వినియోగదారులు నష్టపోతారు. అలాగే కోట్లు పెట్టుబడిగా పెట్టి రీచ్‌లు వేలంలో దక్కించుకున్న వారిపై ధర నియంత్రణతో ఆంక్షలు విధిస్తే, కనీసం పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి ఉండదు. ఉదాహరణకు ప్రస్తుతం ఉన్న పర్యావరణ నిబంధనల ప్రకారం పబ్లిక్ హియరింగ్ వరకు వెళ్లకుండా ఉండాలంటే 25హెక్టార్లకు మించకుండా రీచ్‌ను నిర్ణయించుకోవాలి. వాల్టా చట్టంలోని నిబంధనల ప్రకారం ఒక మీటరు లోతులో ఇసుకను తవ్వాలంటే 25హెక్టార్లలో సుమారు 2లక్షల 50వేల క్యూబిక్ మీటర్ల ఇసుక మాత్రమే లీజుదారుడు తవ్వి తీయగలుతాడు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రప్రభుత్వం నిర్ణయించిన ధరకు మాత్రమే ఇసుక అమ్మాలంటే, వేలం ధర తిరిగి లీజుదారులు సంపాదించలేడు. ఇదే వాదనతో 2010లో హైకోర్టులో ధర నిర్ణయంపై లీజుదారులు న్యాయపోరాటంచేశారు. అలాంటి వివాదాలను ముందుగానే గుర్తించి, న్యాయపరమైన వివాదాలు లేని విధానాన్ని అమలుచేయకపోతే మళ్లీ పాత ఇసుక కథే పునరావృతమవుతుంది. పాత ఇసుక విధానం ఇద్దరు మంత్రులు మధ్య చిచ్చుపెట్టిన అనుభవం కూడా ఉంది. వీటిని దృష్టిలో ఉంచుకుని పాత ఇసుక విధానంలోని లోపాలను సరిదిద్ది, కొత్త విధానాన్ని రూపొందించాలని ప్రజలు కోరుతున్నారు.

చౌక దుకాణాల
పర్యవేక్షణకు కమిటీలు

జన్మభూమి కమిటీల తరహాలోనే
టిడిపి కార్యకర్తలకు ‘ఉపాధి’

ఆంధ్రభూమి బ్యూరో
రాజమండ్రి, డిసెంబర్ 30: రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను ఎంపికచేయటంలో కీలకపాత్రను పోషించే విధంగా రాష్ట్రప్రభుత్వం నియమించిన తెలుగు తమ్ముళ్లతో కూడిన జన్మభూమి కమిటీల తరహాలోనే ఇపుడు కొత్తగా చౌక దుకాణాల పర్యవేక్షణకు రాష్ట్రప్రభుత్వం కమిటీలను నియమించనుంది. చౌక దుకాణాల్లో ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ మెషిన్ల ద్వారా నిత్యావసర సరుకులను పంపిణీచేసే కార్యక్రమాన్ని సమీక్షించటం, పర్యవేక్షించటం వంటి బాధ్యతలను ఈ కమిటీలు నిర్వహిస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు, మండలాలవారీగాను, అర్బన్ ప్రాంతాల్లో వార్డులు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీ నియమించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. కమిటీల్లో బిసి, ఎస్సీ, ఎస్టీ సభ్యులు ఒక్కొక్కరు విధిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రప్రభుత్వం ఆదేశించింది. పంచాయతీ స్థాయిలో నియమించే కమిటీకి సర్పంచ్ అధ్యక్షుడిగాను, పంచాయతీ కార్యదర్శి సభ్య కార్యదర్శిగాను వ్యవహరిస్తారు. కమిటీలో ఎంపిటిసి ఒకరు, ఇద్దరు మహిళా పొదుపు సంఘాల సభ్యులు, ఇద్దరు సామాజిక కార్యకర్తలు, రెవెన్యూ ఇనస్పెక్టర్ లేదా పౌరసరఫరాలశాఖ రెవెన్యూ ఇనస్పెక్టర్ సభ్యులుగా వ్యవహరిస్తారు. వార్డు స్థాయిలో వార్డు కౌన్సిలర్ కమిటీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. మహిళా పొదుపు సంఘాల సభ్యులు ఇద్దరు, సామాజిక కార్యకర్తలు ఇద్దరు సభ్యులుగా వ్యవహరిస్తారు. ఆర్‌ఐ లేదా సివిల్ సప్లయిస్ ఆర్‌ఐ లేదా సివిల్ సప్లయిస్ డిప్యుటీ తహశీల్దార్ సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. కార్పొరేషన్లలోని వార్డు స్థాయిలో కార్పొరేటర్ కమిటీకి అధ్యక్షుడిగా, ఆర్‌ఐ లేదా సివిల్ సప్లయిస్ ఆర్‌ఐ లేదా డిప్యుటీ తహశీల్దార్ సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. మండల స్థాయిలో మండల పరిషత్ అధ్యక్షుడు కమిటీకి అధ్యక్షుడిగా, తహశీల్దార్ లేదా అసిస్టెంట్ సప్లయ్ అధికారి సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. మండల స్థాయి కమిటీల్లో జెడ్పీటిసి, ఇద్దరు ఎంపిటిసిలు, ఇద్దరు సర్పంచ్‌లు, మహిళా పొదపుపు సంఘం సభ్యురాలు ఒకరు సభ్యులుగా వ్యవహరిస్తారు. మున్సిపాలిటీ స్థాయిలో మున్సిపల్ చైర్‌పర్సన్ కమిటీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. కమిటీలో కౌన్సిలర్ ఒకరు, సామాజిక కార్యకర్తలు ముగ్గురు సభ్యులుగా వ్యవహరిస్తారు. తహశీల్దార్ లేదా ఎఎస్‌ఓ సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. కార్పొరేషన్ స్థాయిలో మేయర్ కమిటీ అధ్యక్షతవహిస్తారు. కార్పొరేషన్ స్థాయి కమిటీలో ఒక కార్పొరేటర్, నలుగురు సామాజిక కార్యకర్తలు, ఆర్డీఓ లేదా సబ్‌కలెక్టర్ సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. ఈ కమిటీలు తమ పరిధిలోని చౌక దుకాణాలను పర్యవేక్షిస్తాయి. ఇప్పటికే జన్మభూమి కమిటీల పేరుతో అధికార పార్టీ కార్యకర్తల పెత్తనం, జోక్యం పెరిగిందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తుంటే, ఇపుడు కొత్తగా చౌక దుకాణాల కమిటీలు తెరపైకి రానున్నాయి.