రాష్ట్రీయం

ఆ నగదును ఏం చేయాలి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 11: రాష్టస్థ్రాయిలో అవినీతి నిరోధక శాఖ, జాతీయ స్ధాయిలో సిబిఐ పోలీసులు వివిధ సోదాలు, దాడుల నేపథ్యంలో స్వాధీనం చేసుకున్న నగదు కోట్ల రూపాయల్లో ఉంటుంది. వీటిని కోర్టులోని చెస్ట్ లేదా కోర్టు ఆదేశాల మేరకు తమ కార్యాలయాల చెస్ట్‌ల్లో సిబిఐ, ఏసిబి అధికారులు భద్రపరుస్తుంటారు. సాధారణంగా స్వాధీనం చేసుకున్న నగదును కోర్టు భవనాల్లోని చెస్ట్‌ల్లో భద్రపరుస్తారు. ప్రస్తుతం కేంద్రం ఐదు వందలు, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేసింది. సాధారణ ప్రజలు తమ వద్ద ఉన్న రద్దయిన నోట్లను బ్యాంకులకు వెళ్లి మార్చుకునే వీలుంది. కాని ఏసిబి, సిబిఐ పోలీసు శాఖలు ఏమి చేస్తాయనే విషయమై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. డిసెంబర్ 30లోగా వీటిని మార్చుకోకపోతే ఈ నోట్లన్నీ చెల్లని కాగితాలుగా మారుతాయి.
అవినీతికి పాల్పడే రాష్ట్ర ఉద్యోగులను ఏసిబి, కేంద్ర ఉద్యోగులను సిబిఐ వల పన్ని పట్టుకుంటుంది. ఒక్కోసారి ఇళ్లలో సోదాలు జరిపి భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకుంటారు. ప్రస్తుతం అందరి మెదళ్లను ఈ నగదు సంగతేమిటనే విషయం తొలుస్తోంది. సాధారణంగా ఒకసారి కోర్టుకు కేసు నివేదించిన వెంటనే ఈ సొమ్ము కోర్టు ఆధీనంలోకి వెళుతుంది. ఇటీవలి కాలంలో అంటే పదేళ్లుగా అవినీతి కేసుల్లో పట్టుబడిన సొమ్ములో సింహభాగం ఐదు వందలు, వెయ్యి నోట్ల కరెన్సీ ఉంది. కొన్ని సార్లు కోర్టు ఆదేశంపై నగదును బ్యాంకుల్లో కూడా డిపాజిట్ చేస్తుంటారు. దేశవ్యాప్తంగా అవినీతి నిరోధక శాఖగా పనిచేస్తున్న సిబిఐ, రాష్ట్రంలో ఎసిబి ఆధీనంలో ఉన్న నగదు కోట్లలోనే ఉంటుందని అంచనా. వల పన్ని పట్టుకున్న కేసుల్లో నగదు సాక్ష్యంగా ఉంటుంది. ప్రతి కరెన్సీ నోటు నంబర్‌ను చార్జిషీటులో, ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తావిస్తారు.
కోర్టు, ఏసిబి కస్టడీల్లో ఉన్న రద్దయిన నోట్లను నగదుగా మార్చాలంటే న్యాయ స్థానాలు, ప్రభుత్వం అనుమతి అవసరం. దీనికి సంబంధించి మార్గదర్శకాలు కావాలి. ఈ విషయమై న్యాయ నిపుణులను కూడా సంప్రదిస్తున్నామని ఏసిబి అధికారులు తెలిపారు. డిసెంబర్ 30వరకు సమయం ఉన్నందు వల్ల ముందుగా తమ ఆధీనంలో, కోర్టు ఆధీనంలో ఉన్న నగదులో రద్దయిన నోట్ల విలువను మదింపు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ నగదు వివరాలను కోర్టుకు సమర్పించాలి. కోర్టులు, ప్రభుత్వం ఉమ్మడిగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దీనిపై అడ్వకేట్ జనరల్‌ను ఏసిబి ఉన్నతాధికారులు కలవనున్నారు. రాష్ట్ర డిజిపికి ఈ సమస్యను ఏసిబి నివేదించారు. ఒక్కోసారి అధిక మొత్తంలో సొమ్ము దొరికితే ఐటికి అప్పగిస్తుంటారు. దీనిపై కేంద్ర హోంశాఖకు నివేదించి అనుమతి వచ్చిన వెంటనే నగదు మార్పిడి చేయాల్సి ఉంటుందని సిబిఐ వర్గాలు తెలిపాయి.
రూ.2.5 లక్షలకు మించి
డిపాజిట్ చేసే అకౌంట్లకు గుర్తులు
ఇదిలా ఉండగా బ్యాంకుల్లో రూ.2.5 లక్షలు కంటే ఎక్కువ డిపాజిట్ చేసే అకౌంట్ వద్ద ఫ్లాగ్ గుర్తు పెట్టాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. సాధారణంగా పది లక్షలు అంతకంటే ఎక్కువ సొమ్ము డిపాజిట్ చేసి ఉంటే స్క్రూటినీకి వస్తుంటాయి. కొన్ని చోట్ల సాధారణ ప్రజల అకౌంట్లలో రూ.2.5 లక్షలు అంత కంటే ఎక్కువ సొమ్మును డిపాజిట్ చేసేందుకు నల్లధనం ఉన్న వారు ప్రయత్నిస్తున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజన్సీలకు సమాచారం అందుతోంది.ప్రస్తుతం విశాఖపట్నం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులకు వచ్చే హవాలా సొమ్ముపై కూడా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు కన్ను వేశారు. సికింద్రాబాద్, విజయవాడ,ప్రొద్దుటూరు, రాజమండ్రి, వరంగల్ తదితర ప్రాంతాల్లో బంగారం షాపుల్లో బంగారం తులం మార్కెట్ విలువ కంటే ఎక్కువ సొమ్ము చెల్లించి రద్దయిన కరెన్సీని చలామణి చేసుకుంటున్నట్లు వచ్చిన సమాచారం ఉందని ఐటి శాఖ వర్గాలు తెలిపాయి.

ఐదు బ్యాంకులపై
కోర్టు ధిక్కార కేసు

మారిషస్ బ్యాంక్ దాఖలు స్వీకరించిన హైకోర్టు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, నవంబర్ 11: సుజన ఇండస్ట్రీస్‌కు సంబంధించిన కేసులో అనేక బ్యాంకులపై కోర్టు ధిక్కరణ కేసును మారిషస్ బ్యాంకు హైకోర్టులో దాఖలు చేసింది. బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడిబిఐ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంకులు కోర్టు జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘించాయని మారిషస్ బ్యాంకు హైకోర్టుకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఆ బ్యాంకు సివిల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 14వ తేదీన హైకోర్టు బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. సుజన ఇండస్ట్రీస్ ఈ బ్యాంకులతో జరిపిన లావాదేవీల వివరాలను సమర్పించాలని సింగిల్ కోర్టు జడ్జి జస్టిస్ ఎం సత్యనారాయణ మూర్తి ఆదేశాలు జారీ చేశారు. వారం రోజుల లోపు అఫిడవిట్‌లో వివరాలు పేర్కొని హైకోర్టుకు సమర్పించాలని ఆదేశాలు బ్యాంకులకు జారీ అయ్యాయి. సుజన ఇండస్ట్రీస్ నుంచి వంద కోట్ల రికవరీ కోసం లండన్ కోర్టు డిక్రీ జారీ చేసింది. ఈ డిక్రీ ప్రాతిపదికపై ఎగ్జిక్యూటివ్ పిటిషన్‌ను హైకోర్టులో దాఖలు చేసినట్లు మారిషస్ బ్యాంకు తరపు న్యాయవాది సంజీవ్ కుమార్ తెలిపారు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా బ్యాంకర్లు మాత్రం ఆర్థిక లావాదేవీల వివరాలను ఇవ్వలేదని, అందుకే కోర్టు ధిక్కరణ కింద పిటిషన్ దాఖలు చేసినట్లు ఆయన చెప్పారు.

‘బాహుబలి’
నిర్మాతలపై ఐటి దాడి
హైదరాబాద్, నవంబర్ 11: కేంద్ర ప్రభుత్వం పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేసిన తర్వాత ఆదాయపు పన్ను శాఖ దృష్టి టాలీవుడ్‌పై పడింది. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కి, రికార్డుల సునామీ సృష్టించిన ‘బాహుబలి’ సినిమా నిర్మాతల ఆస్తులపై ఐటి అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. బాహుబలి నిర్మాతలు శోబు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఇళ్లు, ఆఫీసులపై దాడులు జరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా విడుదలై వసూళ్ల పరం గా బాహుబలి టాలీవుడ్ స్థాయిని పెంచింది. ప్రస్తుతం అదే నిర్మాతలు సీక్వెల్‌గా బాహుబలి-2 చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రాజవౌళి దర్శకత్వంలోనే తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన విడుదల హక్కులు భారీ రేట్లకు అమ్ముడైనట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీరిపై ఐటి శాఖ దాడులు చేసింది. ఐటి దాడుల నేపథ్యంలో టాలీవుడ్‌లోని మిగతా నిర్మాతలు బెంబేలెత్తుతున్నారు.