ఆంధ్రప్రదేశ్‌

ఆదివాసీలను మట్టుపెట్టారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, నవంబర్ 12:ఆంధ్రప్రదేశ్ గ్రేహౌండ్స్ దళాలను రద్దు చేయాలని, ఈ ప్రత్యేక దళాలు చట్ట పరిధిలో పని చేయకుండా చంపడమే తమ పని అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయని ఎపి సి ఎల్ సి ఆందోళన వ్యక్తం చేసింది. మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్‌పై ఎపి సిఎల్‌సి ఆధ్వర్యంలో పశ్చిమ బెంగాల్, పంజాబ్, హర్యానా, తమిళనాడు, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల 36 మంది ప్రతినిధులతో కూడిన బృందం నిజ నిర్ధారణ అంశాలను ఎపి సిఎల్‌సి రాష్ట్ర అధ్యక్షుడు వేడంగి చిట్టిబాబు శనివారం వెల్లడించారు. అక్టోబర్ 24వ తేదీన ఆంధ్రా- ఒడిస్సా రాష్ట్రాల సరిహద్దు అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పున ఘటనలో 24 నుంచి 27 వరకు మృతుల సంఖ్య 31కి చేరుకుందని తెలిపారు. బూటకపు ఎన్‌కౌంటర్ హత్యలతో ప్రభుత్వం మానవహక్కులను ఉల్లంఘిస్తోందని, జీవించే హక్కును హరించే పద్ధతిని హక్కుల సంఘాలు వ్యతిరేకిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రా ఒడిస్సా సరిహద్దుల్లో జరిగిన ఎదురు కాల్పుల ఘటనపై ఉన్నత పోలీసు అధికారులు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేయడం విడ్డూరంగా వుందన్నారు. పోలీసులు చెప్పిన కధనానికి, ఎదురు కాల్పుల్లో చనిపోయిన వారి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు చెప్పిన కధనాలు పూర్తిగా భిన్నంగా వున్నాయన్నారు. 23వ తేదీ సాయంత్రం రామగుడకు సమీపంలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశమయ్యారు. సాధారణంగా ఆదివాసీల సమస్యల గురించి చర్చించడానికి సమావేశాలు జరుగుతుంటాయని తెలిపారు. భూ పంపిణీ, భూ సంస్కరణ కోసం మావోయిస్టులు ఇచ్చిన పిలుపు మేరకు ఆయా గ్రామాల ఆదివాసీలు నలభై నుంచి యాభై మంది సమావేశానికి హాజరయ్యారని తెలిపారు. అక్కడ వున్న మావోయిస్టులతో కలిపి అక్కడ ఉన్నవారి సంఖ్య దాదాపు 80 మందికి చేరిందని ఆదివాసీలు తెలియజేసినట్టు చెప్పారు. 24వ తేదీ ఉదయం 5.30 నుంచి 6 గంటల మధ్యలో మావోయిస్టులు సెంట్రీ డ్యూటీల పోస్టింగ్ మార్పులు, రోల్ కాల్, కాలకృత్యాల పనిలో ఉండగా అప్పటికే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన గ్రేహౌండ్స్ పోలీసు బలగాలు దాడికి ఇదే అనుకూలమని భావించాయని పేర్కొన్నారు. ఇది పసిగట్టిన మావోయిస్టులు తమ శ్రేణులను హెచ్చరించడానికి కాల్పులు జరిపారని, అయితే అప్పటికే ఎక్కువ సంఖ్యలో పోలీసు బలగాలను చుట్టుముట్టి మావోయిస్టులపై, గ్రామస్థులపై కాల్పులు ప్రారంభించినట్టు నిజ నిర్ధారణలో తేలిందన్నారు.

మావో డిప్యూటీ కమాండర్ ఎన్‌కౌంటర్

భద్రాచలం, నవంబర్ 12: ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో శుక్రవారం రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు డెప్యూటీ కమాండర్ హతంకాగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. బస్తర్ ఐజీ కల్లూరి చెప్పిన వివరాల ప్రకారం... అంబుజ్‌మడ్ ప్రారంభం నుంచి రానీపాల్ గ్రామాల మధ్య మావోయిస్టులు భారీ సంఖ్యలో సమావేశమై ప్రజాకోర్టు నిర్వహిస్తున్నారనే సమాచారం అందింది. నారాయణ్‌పూర్, కొండగావ్ జిల్లాల పోలీసులు సంయుక్తంగా ఈ ప్రాంతానికి కూంబింగ్‌కు వెళ్లాయి. కుదూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మర్దపాల్ గ్రామ అటవీప్రాంతానికి చేరుకోగానే మావోయిస్టులు పోలీసు బలగాలను చుట్టుముట్టాయి. వెంటనే తేరుకుని మావోయిస్టుల దాడిని తీవ్రంగా ప్రతిఘటించగా దాదాపు రెండు గంటల సేపు ఎదురుకాల్పులు జరిగాయి. అనంతరం మావోయిస్టులు సమీప అడవుల్లోకి పారిపోగా సంఘటనా స్థలంలో మావోయిస్టు డిప్యూటీ కమాండర్ బోటి కశ్యప్ మృతదేహంతో పాటుగా ఇన్సాస్, 12బోర్ తుపాకులు ఇతర సామాగ్రి లభ్యమయ్యాయి. కాగా ఈ ఎదురుకాల్పుల్లో మరో ఇద్దరు మావోయిస్టులు తీవ్రంగా గాయపడ్డారని, మృతి చెందిన డిప్యూటీ కమాండర్ ముండగావ్ ఎల్‌ఓఎస్‌కు చెందిన వాడని ఐజీ కల్లూరి వెల్లడించారు. గాలింపు ముమ్మరంగా జరుపుతున్నట్లు తెలిపారు.