రాష్ట్రీయం

నష్టం రూ.2740 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 13: రాష్ట్రంలో సెప్టెంబర్‌లో కురిసిన భారీ వర్షాల వల్ల రూ.2740 కోట్లమైన నష్టం వాటిల్లిందని, దీనికి కేంద్రం సహాయం అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి దిలీప్‌కుమార్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ కమిషనర్ జగదీశ్‌కుమార్, ఆర్థికశాఖ సహాయ సంచాలకులు ఆర్‌బి కౌల్, కేంద్ర వ్యవసాయ శాఖకు చెందిన అయిల్ సీడ్స్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ ఎస్‌కె కోల్హాట్కర్ తదితరుల కేంద్ర బృందం ఆదివారం హైదరాబాద్‌కు చేరుకుంది. కేంద్ర బృందంతో హరిత ప్లాజాలో సిఎస్ రాజీవ్ శర్మ, వివిధ శాఖలకు చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజీవ్ శర్మ మాట్లాడుతూ సెప్టెంబర్ 21 నుంచి 27 వరకు కురిసిన భారీ వర్షాల వల్ల రాష్ట్రంలో రోడ్లు దెబ్బతిన్నాయని, విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయాయని, తీవ్ర పంట నష్టం వాటిల్లిందని, ఇళ్ళు కూలిపోవడం, పాక్షికంగా దెబ్బతినడం తదితర వాటివల్ల సుమారు రూ. 2740 కోట్ల మేర నష్టం వాటిల్లిందని వివరించారు. రాష్ట్రంలో సంభవించిన నష్టానికి కేంద్రం నుంచి ఇతోధిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. వివిధ శాఖల వారీగా జరిగిన నష్టంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేంద్ర బృందానికి అధికారులు వివరించారు. మున్సిపల్ శాఖకు రూ. 848 కోట్లు, వ్యవసాయ శాఖకు రూ. 192 కోట్లు, నీటిపారుదల శాఖకు రూ. 112 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు రూ. 290 కోట్లు మొత్తంగా రూ.2740 కోట్ల నష్టం వాటిల్లిందని వివరించారు. భారీ వర్షాల వల్ల రాష్ట్రంలో జరిగిన నష్టానికి తాత్కాలిక రిలీఫ్ కింద వీలైనంత ఎక్కువ మొత్తం ఇవ్వడానికి కేంద్రానికి సిఫారసు చేయనున్నట్టు కేంద్ర బృందానికి నాయకత్వం వహించిన హోంశాఖ సంయుక్త కార్యదర్శి దిలీప్‌కుమార్ తెలిపారు. సమావేశం అనంతరం కేంద్ర బృందం జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కామారెడ్డి, నిజామాబాద్, సంగారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట జిల్లాల పర్యటనకు బయలుదేరి వెళ్లింది. సోమవారం ఈ బృందం హైదరాబాద్ నగరంలో పర్యటించనుంది.

చిత్రం.. కరవు నివేదికలపై కేంద్ర బృందంతో సమావేశమైన సిఎస్ రాజీవ్ శర్మ