రాష్ట్రీయం

ప్రజలు ఇబ్బంది పడొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 13: రాష్ట్రంలో బ్యాంకుల వద్ద, తపాలా కార్యాలయాల వద్ద నోట్ల మార్పిడిలో ప్రజలు ఇబ్బందులు పడకుండా అధికార యంత్రాంగం అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పెద్దనోట్ల రద్దు దరిమిలా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై అధికారులతో ఆదివారం తన నివాసం నుంచి ముఖ్యమంత్రి సమీక్షించారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడే అధికార యంత్రాంగం అండగా ఉండాలని, ఆదుకోవాలని సూచించారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఎక్కడికక్కడ ప్రజలతో మమేకం కావాలని, వారికి అండగా ఉండాలని సూచించారు.ప్రజల ఇబ్బందులు తొలగింపుపై రాష్టస్థ్రాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి, ఆర్థిక శాఖ, సివిల్ సప్లైస్, సమాచార శాఖ ఉన్నతాధికారులతో ఒక కమిటీని నియమించామన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్‌నుంచి ఎప్పటికప్పుడు రాష్ట్రంలో పరిస్థితులను ఈ కమిటీ మదింపు చేయాలన్నారు. జిల్లా స్థాయిలో కూడా కలెక్టర్, ఎస్పీ, ఎస్‌ఎల్‌బిసి అధికారులు, సివిల్ సప్లైస్, ఐ అండ్ పిఆర్ శాఖల అధికారులతో కమిటీని బలోపేతం చేయాలన్నారు.ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి కేంద్ర ఆర్థిక మంత్రికి తాను లేఖ రాయనున్నట్లుగా ముఖ్యమంత్రి తెలిపారు. జిల్లా కలెక్టర్లు లీడ్ బ్యాంకు అధికారులతో చర్చించి నోట్ల కొరత లేకుండా చూడాలన్నారు. డ్వాక్రా మహిళా సంఘాలకు రెండవ విడత మూలనిధి చెల్లింపులు, అదనపు రుణాలు ఇవ్వడం త్వరితగతిన చేపట్టడం ద్వారా వ్యవస్థలో నగదు చెలామణి వేగవంతం చేయాలన్నారు. జీవనోపాధి కోల్పోయిన తోపుడు బండ్ల వ్యాపారులు, చిరు వ్యాపారులను ఆదుకోవాలన్నారు. నోట్ల మార్పిడిలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని బిల్లుల చెల్లింపులో ఆయా శాఖల అధికారులు ఓపిక పట్టాలని ముఖ్యమంత్రి కోరారు. కరెంటు బిల్లులు, ఇతర సర్వీసులకు సంబంధించిన బిల్లులు చెల్లించలేదని కనెక్షన్లు తొలగించవద్దని ఆదేశించారు. బ్యాంకుల వద్ద రద్దీ నివారణకు, నియంత్రణకు అన్ని మార్గాలు అనుసరించాలన్నారు. బ్యాంకుల్లో క్యూల వద్ద బందోబస్తు పెంచాలని, టోకెన్ సిస్టమ్ పెట్టి, స్లిప్‌లు ఇచ్చి, సెల్‌ఫోన్ నంబర్లు తీసుకుని ఎస్‌ఎంఎస్ మెసేజ్‌లు పంపాలని, తద్వారా రద్దీని నియంత్రించాలన్నారు.
ఉప్పు తక్కువ ఉందనే వదంతులను నమ్మవద్దని ప్రజలకు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఉప్పు కృత్రిమ కొరత సృష్టిస్తే జైలుకు పంపుతామని అక్రమ వ్యాపారులు, దళారులను హెచ్చరించారు. ధరల నియంత్రణపై పౌర సరఫరాల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అవసరమైతే మార్కెట్ ఇంటర్వెన్షన్ చేపట్టి ధరలు పెరగకుండా చూడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి టక్కర్, ఇన్‌ఛార్జి డిజిపి సాంబశివరావు, ఆర్థిక శాఖ కార్యదర్శి అజయ్ కల్లాం, పౌర సరఫరాల శాఖ కమిషనర్ రాజశేఖర్, వివిధ జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు ఈ టెలీ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.