రాష్ట్రీయం

దీపారాధనతో మానసిక ప్రశాంతత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ కాచిగూడ, నవంబర్ 13: దీపం వెలిగించడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. భక్తి టివి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవంలో ఆదివారం ఆయన పాల్గొన్నారు. ముందుగా కీసరగుట్ట శ్రీ వేంకటేశ్వర వేద సంస్కృత పాఠశాల వారిచే వేదపఠనం చేశారు. కార్మిక మాసం వైశిష్ట్యం తెలియజేస్తూ బంగారయ్య శర్మ భక్తులను ఉద్దేశించి ప్రవచనాలు చేశారు. అనంతరం ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా వేద పండితులు నిర్వహించారు. భక్తులచే శ్రీ వేంకటేశ్వరస్వామి ముడుపుల పూజను చేయించారు. కల్యాణోత్సవం అనంతరం స్వామివారిని గరుడ వాహనంపై ఊరేగించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చంద్రబాబు నాయుడు వేంకటేశ్వరస్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరాధన చేయడం వల్ల మనస్సుకు ప్రశాంతత చేకూరుతుందని పేర్కొన్నారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి కార్యక్రమం ఎక్కడా చూడలేదని, భక్తి టివి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం వల్ల మొదటిసారిగా చూస్తున్నానని పేర్కొన్నారు. నరేంద్రచౌదరి ఎంతో క్రమశిక్షణతో 15 రోజుల పాటు కోటి దీపోత్సవం నిర్వహించడం ఎంతో సంతోషకరమని తెలిపారు. ప్రపంచీకరణ నేపథ్యంలో ఎన్నో ఒత్తిళ్లకు గురౌతుంటామని, మనస్సుకు ప్రశాంతత కలగాలంటే భక్తి ఎంతో అవసరమని అన్నారు. నరేంద్రచౌదరి ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించేందుకు శ్రీకారం చుట్టడం ఎంతో అభినందనీయమని అన్నారు. దైవ కార్యక్రమానికి మించింది ఏదీ లేదన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమానికి రావడం వల్ల నూతన ఉత్సాహం వచ్చిందన్నారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలకు ఇబ్బందులు వచ్చాయని, ప్రజల్లో ఇబ్బందులు వచ్చినప్పుడు తాను ఆనందంగా ఉండలేనని, కానీ ఇక్కడికి వచ్చిన తరువాత ఇబ్బందులను పూర్తిగా మరచిపోయానని, తన జీవితం ధన్యమైందన్నారు. శక్తి కోసం మహాయజ్ఞం చేస్తున్న భక్తి టివి వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని తెలిపారు. అమరావతిలో కృష్ణానది ఒడ్డున కోటి దిపోత్సవ కార్యక్రమం నిర్వహించాలని ఎన్‌టివి అధినేత నరేంద్ర చౌదరిని కోరారు. అమరావతిలో కోటి దిపోత్సవం ఏర్పాటు చేస్తే ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలను అందిస్తుందని హామీ ఇచ్చారు. దైవ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ దేవుడు ఆశీర్వాదాలు అందించాలని ఆకాంక్షించారు. అనంతరం ఎన్‌టివి అధినేత నరేంద్ర చౌదరి మాట్లాడుతూ వచ్చే కార్తీక మాసంలో 15రోజుల పాటు అమరావతిలో కూడా కోటి దీపోత్సవ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. చంద్రబాబు కార్తీక దీపం వెలిగించారు. కార్యక్రమంలో మంత్రాలయ పీఠాధిపతి శ్రీ సుబుదేంధ్రతీర్థ స్వామి, ఉడిపి పలిమారు పీఠాధిపతి శ్రీ విద్యాధీశతీర్థ స్వామి పాల్గొన్నారు.

చిత్రం.. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవంలో జ్యోతిని వెలిగిస్తున్న సిఎం చంద్రబాబు