ఆంధ్రప్రదేశ్‌

ప్రొఫెసర్ లక్ష్మి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 14: గుంటూరు ప్రభుత్వ వైద్యకళాశాల పిజి విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య కేసులో అభియోగాలను ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ లక్ష్మి, అతని భర్త విజయసారథిని గుంటూరు పోలీసులు సోమవారం బెంగుళూరులోని నాగబావి సెంటర్ సమీపంలో అరెస్టు చేశారు. గత 21 రోజులుగా పోలీసులు లక్ష్మి ఆచూకికోసం విస్తృతంగా గాలిస్తున్నారు. ఆమెతో సన్నిహితంగా ఉండే ఓ ఉద్యోగిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించిన అనంతరం ఆమె బెంగళూరులో ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. సీఐ హైమారావు, ఎస్‌ఐ వీరేంద్రబాబుల నేతృత్వంలో సిబ్బంది ఆదివారం బెంగుళూరు వెళ్లి సోమవారం బంధువుల నివాసానికి వెళ్లే ప్రయత్నం చేశారు. ముందుగానే ఆమెకు సంబంధించిన డెబిట్, క్రెడిట్ కార్డులు, ఏటిఎం కార్డులు, ఫోన్ నంబర్లను సేకరించిన పోలీసులు సమాచారం వచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నారు. సోమవారం ఉదయం తన బంధువుల ఇంటి నుంచి బయటకు వచ్చిన లక్ష్మి క్రెడిట్ కార్డును ఉపయోగించి డబ్బులు డ్రా చేస్తుండగా పోలీసులు వలపన్ని పట్టుకున్నట్లు సమాచారం. సంధ్యారాణి ఆత్మహత్యతో స్పందించిన మెడికల్ విద్యార్థులు ఇందుకు కారణమైన లక్ష్మిని అరెస్టు చేయటంతో పాటు విధుల నుంచి తొలగించాలని దశల వారీ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇటీవల గుంటూరు న్యాయస్థానంలో ప్రొఫెసర్ తరుపు న్యాయవాదులు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయటంతో బెయిల్ మంజూరుకు కోర్టు నిరాకరిస్తూ పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీంతో ఆమె కేసును పూర్తిగా కొట్టివేయాలని, బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును ఆమె ఆశ్రయించారు. హైకోర్టు విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. గత్యంతరంలేని పరిస్థితుల్లో లక్ష్మి పోలీసులకు సమాచారం అందించటం ద్వారా అరెస్టయ్యారనే ప్రచారం జరుగుతోంది. పిజి గైనకాలజీ విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య అనంతరం ఆమె భర్త ఆత్మహత్యాయత్నం, తండ్రికి గుండెపోటు రావడంతో చలించిన వైద్య విద్యార్థులు రాష్టవ్య్రాప్త ఆందోళనకు సిద్ధమవుతున్నారు. వైద్య విద్యార్థినులతో పాటు నర్సింగ్ స్టూడెంట్స్‌ను కూడా ప్రొఫెసర్ లక్ష్మి వేధింపులకు గురిచేసేవారని ప్రభుత్వానికి నివేదిక కూడా నివేదిక అందింది. కాగా ఈ కేసుకు సంబంధించి గుంటూరు ఆర్డీవో నేతృత్వంలో మెజిస్టీరియల్ విచారణ జరిపి ప్రాథమిక వివరాలు సేకరించారు.