ఆంధ్రప్రదేశ్‌

4 గంటలు.. రూ.50 కోట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 14: విశాఖ కేంద్రంగా ఒకేరోజు 50 కోట్ల రూపాయల బంగారం అమ్ముడుపోయింది. ఆశ్చర్యం కలిగించినా ఇది యధార్థం. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసినట్టు కేంద్రం ప్రకటించిన రోజు రాత్రి విశాఖ నగరంలో భారీయెత్తున బంగారం విక్రయాలు జరిగినట్టు ఆదాయపు పన్ను శాఖ అధికారులు గుర్తించారు. నోట్ల రద్దు ప్రకటన వెలువడిన 8వ తేదీ రాత్రి 8 గంటల తరువాత నాలుగు గంటల వ్యవధిలోనే ఈ లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. కొన్ని ప్రముఖ బంగారు దుకాణాలు రాత్రి 8 నుంచి 12 గంటల మధ్య వ్యాపారులు లావాదేవీలు జరిపినట్టు స్పష్టమైంది. ఒక ప్రముఖ బంగారు దుకాణంలో రూ.9కోట్ల మేర వ్యాపార లావాదేవీలు జరిగినట్టు నిర్ధారించారు. సాలీనా రూ.100 కోట్ల వ్యాపారం నిర్వహించే పారిశ్రామికవేత్తలు, వ్యాపారవర్గాల వివరాలను తీసుకుని, వారి లావాదేవీలను పరిశీలించినట్టు ఐటి వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే అటు కొనుగోలుదారులు, ఇటు వ్యాపారులు చట్టంలో లొసుగులను ఆసరా చేసుకుని నాలుగు గంటల వ్యవధిలోనే రూ.50 కోట్ల నల్లధనాన్ని బంగారం రూపంలోకి మార్చినట్టు ఐటి అధికారులు అనుమానిస్తున్నారు. రూ.2 లక్షల వరకు కొనుగోళ్లకు పాన్‌కార్డు అవసరం లేదన్న నిబంధన ఇక్కడ బంగారు వర్తకులు అన్వయించుకున్నారు. దీంతో నోట్ల రద్దునాటి లావాదేవీలన్నీ రూ.2 లక్షల లోపే ఉండటంతో ఐటి అధికారులు విచారణ జరుపుతున్నారు. అయితే ఈ వివరాలు వెల్లడించేందుకు వ్యాపారులు ముందుకు రాకపోవడంతో ఇప్పుడు ఐటి అధికారులు బంగారు వర్తకుల మెడకు ఉచ్చు బిగించేలా వ్యూహరచన చేస్తున్నారు. వర్తకుల వద్దనున్న నల్లధనం తెల్లధనంగా మార్చుకునేందుకే అర్ధరాత్రి లావాదేవీలకు పాల్పడ్డారంటూ ఐటి అధికారులు తాఖీదులు ఇవ్వడంతో కొనుగోలుదారుల వివరాలు వెల్లడిస్తామంటూ బంగారు వర్తకులు దారిలోకి వస్తున్నారు. విశాఖ నగరంలో లెక్కల్లో చూపని నల్లధనం రూ.500 కోట్ల వరకూ ఈ విధంగా చేతులు మారి ఉంటుందని ఐటి అధికారులు అంచనా వేస్తున్నారు.