రాష్ట్రీయం

ముక్కోటి ఏకాదశి తేదీపై వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, నవంబర్ 15: వివాదాలకు కేంద్ర బిందువైన శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో మరో వివాదం తెరపైకి వచ్చింది. 2017 జనవరిలో శ్రీ సీతారామచంద్రస్వామికి నిర్వహించే ముక్కోటి ఏకాదశి, ఉత్తర ద్వారదర్శనం తేదీ విషయంలో పెద్ద చిక్కు వచ్చిపడింది. ముందుగా వైదిక కమిటీ 2017 జనవరి 8న ముక్కోటి ఏకాదశి, జనవరి 7న రాత్రి గోదావరిలో శ్రీసీతారామచంద్రస్వామికి తెప్పోత్సవం నిర్వహిస్తామని షెడ్యూల్‌ను విడుదల చేసింది. తేదీలు ఖరారు చేసి పత్రికల్లో కూడా ప్రచురించారు.
కానీ పంచాంగాల ద్వారా నిర్ణయించిన తేదీలో ముహూర్తం మిగులు ఉండటంతో వైదిక కమిటీ నాలుక్కరుచుకుంది. ఇటీవలే షష్టి పూర్తి చేసుకుని శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనానికి వచ్చిన శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌స్వామితో కూడా వైదిక కమిటీ తేదీ విషయంలో సుదీర్ఘంగా సుమారు 6 గంటల పాటు చర్చించింది. ఆగమశాస్త్రం ప్రకారం 2017 జనవరి 9న ముక్కోటి ఏకాదశి, జనవరి 8న తెప్పోత్సవం నిర్వహించాలని తుది నిర్ణయానికి వచ్చారు. తేదీ మార్పు విషయం రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. నివేదిక ప్రస్తుతం కమిషనర్ వద్ద ఉంది. ఆంధ్రాలోని సింహాచలం, తెలంగాణలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో మాత్రమే 2017 జనవరి 9న ముక్కోటి ఏకాదశి ఆగమశాస్త్రం ప్రకారం వచ్చింది. శ్రీరంగంతో సహా అన్ని దేవాలయాల్లో జనవరి 7న తెప్పోత్సవం, 8న ముక్కోటి ఏకాదశిగా ముహూర్తం నిర్ణయించారు.
కానీ భద్రాచలంలో మాత్రం తాజాగా తేదీని మార్పు చేశారు. దీంతో మళ్లీ వివాదం రగులుకుంది. గతంలో కూడా శ్రీరామనవమి విషయంలో దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. న్యాయస్థానాలు జోక్యం చేసుకునే వరకు పరిస్థితులు దారితీశాయి. తాజా వివాదం ఎటు దారితీస్తుందోనన్న ఆందోళన భక్తుల్లో మొదలైంది.