రాష్ట్రీయం

దత్తత గ్రామానికి నేడు సచిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, నవంబర్ 15: రాజ్యసభ సభ్యుడు, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తాను దత్తత తీసుకున్న పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పుట్టంరాజుకండ్రిగ గ్రామానికి బుధవారం వస్తున్నారు. 2014లో ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు సచిన్ ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. అప్పటి వరకూ పక్క ప్రాంతాలకు కూడా సరిగా తెలియని ఈ గ్రామం ఒక్కసారిగా దేశవ్యాప్తంగా వార్తల్లోకెక్కింది. 2014 నవంబర్ 16న ఈ గ్రామాన్ని సచిన్ టెండూల్కర్ సందర్శించి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి, వాటిలో కొన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తన ఎంపి నిధుల నుంచి సచిన్ ఈ గ్రామాభివృద్ధికి సుమారు రూ.2.50కోట్లు మంజూరు చేయగా, ప్రభుత్వం మరో రూ.3కోట్లు జతచేసి రూ.5.50కోట్లతో పలు అభివృద్ధి పనులను ఈ గ్రామంలో చేపట్టి పూర్తి చేశారు. గ్రామంలో భూగర్భ డ్రైనేజి, కమ్యూనిటీ భవనం, సిమెంటు రోడ్లు, పక్కా గృహాలు నిర్మించారు. బహిరంగ మలవిసర్జన రహిత గ్రామంగా నిలపడంలో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణం గ్రామంలో 80శాతం మేర పూర్తయింది.
గ్రామ సమీపంలో చేపల చెరువును ఏర్పాటు చేసి గ్రామాభివృద్ధికి ఉపయోగపడేలా తీర్చిదిద్దారు.గ్రామంలో 90శాతం వరకూ నిరక్ష్యరాస్యులే. ప్రస్తుతం సచిన్ టెండూల్కర్ తమ గ్రామానికి దైవంతో సమానమని స్థానికులు ప్రశంసిస్తున్నారు. ప్రభుత్వ అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు సచిన్ టెండూల్కర్ ఈ గ్రామానికి వస్తుండడంతో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లా ఎస్పీ విశాల్‌గున్ని తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై పోలీస్ సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు.