రాష్ట్రీయం

సంధ్యారాణిని వేధించలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 15: గుంటూరు ప్రభుత్వ వైద్యకళాశాల గైనకాలజీ పిజి విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య కేసులో ప్రొఫెసర్ లక్ష్మి వేధింపులే ప్రధాన కారణంగా పోలీసులు ధ్రువీకరించారు. ఈ కేసులో లక్ష్మితో పాటు ఆమె భర్త డాక్టర్ విజయసారథి, వియ్యంకుడు, ఎల్‌ఐసి ఏజెంట్ యలవర్తి ధన్వంతరావు, కుమారుడు భార్గవ్ కిరణ్, బెంగళూరుకు చెందిన విజయసారథి స్నేహితుడు ప్రవీణ్‌కుమార్‌లను నగర పోలీసులు అరెస్టుచేసి మంగళవారం గుంటూరు కోర్టుకు హాజరు పరిచారు. వారికి కోర్టు ఈ నెల 29 వరకు రిమాండ్ విధించింది. ప్రొఫెసర్ లక్ష్మి పరారీ, అరెస్టు, విచారణకు సంబంధించి గుంటూరు రేంజి ఐజి ఎన్ సంజయ్, రూరల్ ఎస్పీ నారాయణనాయక్, నగర అదనపు ఎస్పీ భాస్కరరావు మీడియాకు వివరించారు. భర్త విజయసారథి వద్దకు వచ్చే ఓ పేషెంట్ ఇచ్చిన భరోసా మేరకు బెయిల్ వస్తుందనే భావనతో లక్ష్మి కుటుంబసభ్యులు గత 23 రోజులుగా 16 సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను దర్శించుకుని రెండు రోజుల క్రితం బెంగళూరుకు చేరుకున్నారు. వీరి ఆచూకీ కోసం గుంటూరు రేంజి పరిధిలో 8 ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. అరెస్టుకు సంబంధించి ఏర్పాటైన ప్రత్యేక బృందం సభ్యులు నెల్లూరు జిల్లా వాకాడు సిఐ అక్కేశ్వరరావు, గుంటూరు అర్బన్ పోలీసు కంట్రోల్ రూము సిఐ హైమారావు, చిలకలూరిపేట సిఐ సురేష్‌బాబు, కొల్లూరు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, సిసిఎస్ ఎస్‌ఐ వీరేంద్ర, ఈపూరు ఎస్‌ఐ ఉజ్వలకుమార్, కానిస్టేబుళ్లు జి బాలాజీ, సిహెచ్ రాము బెంగళూరుకు చేరుకున్నారు. పుణ్యక్షేత్రాలను సందర్శించి వచ్చిన ప్రొఫెసర్ లక్ష్మి దంపతుల కదలికలపై నిఘాపెట్టారు. నగరంలోనే ఓ లాడ్జిలో అప్పటికే విడిదిచేసిన లక్ష్మి ఖాళీచేసే సమయంలో కొటక్ మహీంద్ర క్రెడిట్ కార్డును కార్పొరేషన్ బ్యాంక్‌కు చెల్లించే విధంగా స్వైప్ చేశారు. అంతేకాదు ఈ విషయాన్ని విజయసారథి సన్నిహితునికి కాయిన్ బాక్స్ నుంచి కాల్ చేస్తుండగా ఈమెయిల్ ద్వారా ఇక్కడి పోలీసు ఐటి విభాగం బెంగళూరు వెళ్లిన బృందాన్ని అప్రమత్తం చేశారు. ఎట్టకేలకు లక్ష్మి దంపతులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి విమాన, రైల్వే, బస్సు టిక్కెట్లు, ఇతర రశీదులతో కలిపి 28 స్లిప్‌లను స్వాధీనం చేసుకున్నట్లు ఐజి తెలిపారు. ఈ కేసుతో మరికొందరికి ప్రమేయం ఉన్నట్లు తాము గుర్తించామని త్వరలోనే వారిని కూడా అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. ఓ పై స్థాయి అధికారిని అరెస్టు చేయాలంటే తగిన ఆధారాలు ఉండాలని అందువల్లే ఈ కేసులో జాప్యం జరిగిందని ఐజి స్పష్టం చేశారు. కళాశాలలో మెడికోల పట్ల ఆమె వ్యవహారశైలి, వేధింపులకు సంబంధించి శాఖాపరమైన విచారణ జరుగుతోందని తెలిపారు.
గత 23 సంవత్సరాలుగా వైద్య వృత్తిలో కొనసాగుతున్నా.. ఏనాడు నాపై ఆరోపణలు రాలేదు.. సంధ్యారాణికి ఏదైనా సావధానంగానే వివరించానని ప్రొఫెసర్ లక్ష్మి మీడియాకు తెలిపారు. ఒక్కోసారి ఆమె చెప్పిన మాట వినేది కాదన్నారు. అందువల్ల సున్నితంగా మందలించినట్లు తెలిపారు. తమపై ఆరోపణలు, అభియోగాలు సరికాదన్నారు.
సంధ్యారాణి ఆత్మహత్య దురదృష్టకరం.. మాకు బెయిల్ వస్తుందనే ధీమాతోనే చట్టాన్ని గౌరవిస్తూనే పుణ్యక్షేత్రాలకు వెళ్లివచ్చామని లక్ష్మి భర్త డాక్టర్ విజయసారథి తెలిపారు. తమ కుటుంబ సభ్యులపై అభియోగాలు వచ్చినందునే పోలీసుల ఎదుట ఇలాంటి పరిస్థితిలో దోషులుగా నిలవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

చిత్రం.. మీడియాకు ప్రొఫెసర్ లక్ష్మి, కుటుంబ సభ్యుల అరెస్టుపై వివరిస్తున్న గుంటూరు రేంజి ఐజి సంజయ్