రాష్ట్రీయం

ఉల్లికి నోట్ల దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 15: పెద్దనోట్ల రద్దు ప్రభావం ఉల్లిపై తీవ్రంగా పడబోతోంది. ఉల్లిపంట ఈసారి బాగానే ఉన్నా ఒక్కో లారీ ఉల్లికి దిగుమతి, రవాణా, హమాలీ చార్జీలు కలిపి 50వేల రూపాయల వరకు వ్యయం అవుతుంది. కానీ, నోట్లరద్దుతో నగదు చెలామణిలో లేకుండా పోవటంతో వ్యాపారానికి పెద్ద విఘాతం ఏర్పడింది. ప్రస్తుత పరిస్థితిలో తాము ట్రేడింగ్ చేయలేమని వ్యాపారులు తేల్చి చెప్తున్నారు. దేశంలోని ఏ ప్రాంతానికైనా ఎక్కువగా మహారాష్ట్ర నుంచే ఉల్లి దిగుమతి అవుతుంది. అదే విధంగా రాష్ట్రంలో కొల్లాపూర్, ఆలంపూర్‌లో రైతులు ఉల్లి పండిస్తారు. నగదు కొరత వల్ల ట్రేడర్లు చేతులు ఎత్తేయడంతో మార్కెటింగ్ శాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. మార్కెట్‌లో ఉల్లికి కొరత సృష్టించి ధరలు పెంచాలనే ప్రయత్నాలను సహించేది లేదని చెప్పింది. అదే సమయంలో రాష్ట్రంలో ఉల్లి పండించే కొల్లాపూర్, ఆలంపూర్ రైతుల నుంచి మార్కెటింగ్ శాఖ ఉల్లిని కొనుగోలు చేసి మలక్‌పేట మార్కెట్‌లో, రైతు బజార్లలో ప్రజలకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. మలక్‌పేట ఉల్లి మార్కెట్ ఇరుకుగా ఉన్నందున పటాన్‌చెరుకు ఆనుకొని ఔటర్ రింగు రోడ్డులో ఏర్పాటు చేసిన మార్కెట్ యార్డుకు ఉల్లి మార్కెట్‌ను తరలించాలని ఆదేశించారు.
వెయ్యి, 500 రూపాయల నోట్ల రద్దు నేపథ్యంలో మార్కెటింగ్ శాఖపై పడే ప్రభావం గురించి మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఉల్లి ట్రేడర్లతో సమావేశం అయ్యారు. రైతుల నుంచి ఉల్లిని ఎనిమిది రూపాయల చొప్పున కొనుగోలు చేసి 10 రూపాయలకు విక్రయించాలని నిర్ణయించారు. పటాన్‌చెరు మార్కెట్ యార్డును అత్యంత ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసేందుకు పూణె ఉల్లి మార్కెట్‌ను అధ్యయనం చేసేందుకు ఒక బృందాన్ని పంపించాలని నిర్ణయించారు.
వ్యవసాయ మార్కెటు చట్టంలో సంస్కరణలు తీసుకు వచ్చి కొత్త చట్టం రూపొందించేందుకు నల్సార్ యూనివర్సిటీ ప్రతినిధులతో వారం రోజుల్లో సమావేశం నిర్వహించాలని చెప్పారు. రైతులకు మరింత ప్రయోజనం కలిగే విధంగా కొత్త చట్టం రూపొందించనున్నట్టు చెప్పారు. పత్తి ధర క్వింటాలుకు ప్రస్తుతం 4500 రూపాయల నుండి ఐదువేల రూపాయలు లభిస్తున్నదని, ధర తగ్గకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. గోదాముల నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నల్లగొండలో బత్తాయిల మార్కెట్ నిర్మాణానికి వెంటనే ప్రతిపాదనలు పంపించాలని చెప్పారు.

చిత్రం.. గిరాకీ లేక సంచులపైనే నిద్రిస్తున్న ఉల్లిగడ్డల వ్యాపారి