ఆంధ్రప్రదేశ్‌

టెక్నాలజీ సాయంతో పారదర్శకత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 16: సంక్షేమ పథకాల అమలులో టెక్నాలజీని వినియోగించడం వల్ల పారదర్శకత పెరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. విజయవాడలోని తన నివాస గృహం నుంచి ఆయన బుధవారం వివిధ సంక్షేమ శాఖల పనితీరుపై టెలికాన్ఫరెన్సును నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ పారదర్శకత పెంచి సంక్షేమ పథకాలను అర్హులకు చేరేలా చూడాలని అధికారులను కోరారు. బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో మాదిరిగా కాకుండా విద్యార్థుల ఫీజులను అదే సంవత్సరం రీ-ఇంబర్స్‌మెంట్ చేస్తోందన్నారు. అంబేద్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ స్కీమ్, ఎన్టీఆర్ విద్యోన్నతి పథకాలను సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండేలా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దాలన్నారు.
మరో రెండు వర్శిటీల ఏర్పాటు
రాష్ట్రంలో మరో రెండు వర్సిటీలను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. కేంద్ర వర్శిటీ తరహాలో ఎనర్జీ వర్శిటీని, కాకినాడలో లాజిస్టిక్స్ వర్శిటీ ఏర్పాటు చేయనున్నారు. ఎనర్జీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇనె్వస్ట్‌మెంట్ విభాగాలకు సంబంధించిన వివిధ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల గురించి సిఎం క్యాంప్ కార్యాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ ఎనర్జీ వర్సిటీని 500 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయనున్నామన్నారు. లాజిస్టిక్స్ వర్సిటీలో ప్రవేశాలు వచ్చే ఏడాది నుంచి నిర్వహించేలా 90 ఎకరాల స్థలంలో 200 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. చెత్త నుంచి విద్యుత్ కర్మాగారాలను 10 ఏర్పాటు చేయనున్నామని, అందులో 7 కర్మాగారాలు వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి పూర్తి అవుతాయని తెలిపారు. 2018-19 సంవత్సరానికి 4 వేల మెగావాట్ల మేరకు సౌర విద్యుత్ ఉత్తత్తి చేసేందుకు వీలుగా 3 యూనిట్లను ఏర్పాటు చేస్తున్మాని తెలిపారు. ఎపి జెన్కోకు చెందిన విజయవాడ, కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్స్, పూడిమడకలోని అల్ట్రా సూపర్ క్రిటికల్ ప్లాంట్ పనులను బొగ్గు కేటాయింపులు పూర్తి అయ్యాక చేపడతారని తెలిపారు. ఫైబర్‌గ్రిడ్‌కు సంబంధించిన సెట్ టాప్ బాక్స్‌ల డిసెంబర్ 10 నాటికి సరఫరా అవుతాయని తెలిపారు. రాష్ట్రాన్ని పెట్రోలియం హబ్‌గా మార్చాలని అధికారులను ఆదేశించారు. తిరుపతి, రాజమండ్రి, విశాఖపట్నం, విజయవాడ, కడప విమానాశ్రయాలలో ప్రయాణీకుల వృద్ధి 44 శాతం నమోదైందని అధికారులు సిఎంకు వివరించారు. భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి 82 శాతం భూమి సేకరించామని తెలిపారు. పర్యావరణ అనుమతి కోసం నివేదికను డిసెంబర్ మొదటి వారంలో కాలుష్య నియంత్రణ మండలికి అందచేయనున్నట్లు తెలిపారు. విశాఖలో నిర్మించ తలపెట్టిన కనె్వన్షన్ సెంటర్‌ను సముద్రం కనిపించేలా నిర్మించాలని, భోగాపురం- భీమిలి మధ్య ప్రపంచ స్థాయి వౌలిక వసతులు ఏర్పాటు చేయలని ఆదేశించారు.

చిత్రం.. అధికారులతో సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు