ఆంధ్రప్రదేశ్‌

రాయల చరిత్ర పరిరక్షణకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, నవంబర్ 16: భారతదేశ చరిత్రలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న హంపీ విజయనగర సంస్థానాధీశుడు శ్రీకృష్ణదేవరాయల చరిత్రను పరిరక్షించునేందుకు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నట్టు కృష్ణదేవరాయల 19వ తరం వారసుడు రాజాకృష్ణదేవరాయలు స్పష్టం చేశారు. బుధవారం తన తల్లి రత్నశ్రీ చంద్రకాంతదేవి, కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణదేవరాయలు విలేఖరులతో మాట్లాడారు. కర్నాటకలోని హనిగుండి ప్రాంతంలో శ్రీకృష్ణదేవరాయలు నివాసమున్న శిథిల భవనాన్ని ఇటీవలే పునరుద్ధరించినట్టు చెప్పారు. డిసెంబర్ 18వ తేదీన ఆ నివాసంలో గృహప్రవేశం వేడుక జరపనున్నట్టు ఆయన ప్రకటించారు. కర్నాటక పరిసరాల్లో ఉన్న కృష్ణదేవరాయల చారిత్రక సాక్ష్యాలను పరిరక్షించే దిశ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టు పేర్కొన్నారు. దశల వారీగా కృష్ణదేవరాయల చరిత్రను భవిష్యత్ తరాలకు అందించే దిశగా చర్యలు తీసుకుంటామని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాయలవారి సాహిత్యాన్ని కాపాడుకోవలసిన బాధ్యత కూడా ఉందన్నారు. రాయల చరిత్రపై పరిశోధన చేసే అంశంపై కూడా ఆలోచన చేసున్నానని ఆయన చెప్పారు. సింహాచలేశుని దేవాలయాన్ని సందర్శించడం, స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. సింహాద్రినాథునికి అలనాడు శ్రీకృష్ణదేవరాయలు సమర్పించిన కానుకల వివరాలతో రాసిన బోర్డును, రాతి స్తంభంపై రాసిన శాసనాన్ని రాయలు వారసులు తిలకించారు. సింహగిరిపైన రాయలవారు ప్రతిష్ఠించిన విజయ స్థూపం ప్రాంగణాన్ని వీరు సందర్శించారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు దేవస్ధానం ప్రణాళికలు సిద్ధంచేస్తుందని ఉద్యోగుల ద్వారా తెలుకున్న రాయలవారి వారసులు ఆనందం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి దేవస్థానం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని కూడా వీరు పరిశీలించారు. రాయలవారి చారిత్రక సాక్ష్యాలుగా ఉన్న శాసనం, విజయస్థూపం వద్ద వారసులు ఫోటోలు దిగారు.

టిడిపి ఎమ్మెల్సీ
అభ్యర్థుల ఖరారు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, నవంబర్ 16: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుని ఆదేశాల మేరకు మూడు ఎమ్మెల్సీ (పట్ట్భద్రుల) స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. ప్రకాశం - నెల్లూరు- చిత్తూరు పట్ట్భద్రుల స్థానానికి వేమిరెడ్డి పట్ట్భారెడ్డిని, అనంతపురం-కడప- కర్నూల్ పట్ట్భద్రుల స్థానానికి కె.జె.రెడ్డిని, అనంతపురం- కడప- కర్నూల్ ఉపాధ్యాయుల స్థానానికి బచ్చల పుల్లయ్యను నిర్ణయించారు.

పెరిగిన ఆస్తి పన్ను వసూళ్లు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, నవంబర్ 16: పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా, రాష్ట్రంలోని పురపాలక సంఘాలకు మాత్రం కలిసి వస్తోంది. రద్దు చేసిన పెద్ద నోట్లను ఆస్తి పన్ను చెల్లింపులకు అనుమతిస్తుండటంతో ఎక్కువ మంది ఆస్తి పన్నును చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో జనం ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే ఈ ఇబ్బందిని కొంతమేర తొలగించడంతో పాటు ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు విద్యుత్ పంపిణీ సంస్థలు, రైల్వే శాఖ, పురపాలక సంఘాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. రద్దు అయిన పెద్ద నోట్లను ఈ నెల 24 వరకూ స్వీకరిస్తామని ఆయా శాఖల అధికారులు ప్రకటించడం తెలిసిందే. ఆస్తి పన్ను చెల్లింపులు జోరందుకున్నాయి. ఐదు రోజుల్లో దాదాపు 60 కోట్ల రూపాయల మేరకు ఆస్తిపన్ను వసూలైంది. ఈ నెల 24 వరకూ గడువు ఉండటంతో మరింతగా ఆదాయం పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. నోట్ల మార్పిడి కోసం బ్యాంక్‌ల చుట్టూ తిరిగే కన్నా, ఇదే మేలని చాలా మంది భావిస్తున్నారు.