రాష్ట్రీయం

చౌక ధరకే పిఓఎస్ యంత్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, నవంబర్ 17: చిన్న మొత్తాలలో కరెన్సీ నోట్ల లభ్యత తగినంత అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నగదు రహిత లావాదేవీలకు అధిక ప్రాధాన్యతనివ్వాలని, ఆ దిశగా తక్షణం ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
ఈ మేరకు అన్ని రకాల షాపుల్లో డెబిట్/క్రెడిట్ కార్డుల స్వైపింగ్ ద్వారా చిన్న మొత్తాలలో కూడా నిత్యావసరాలను ప్రజలు కొనుగోలు చేసేందుకు వీలుగా ప్రభుత్వ యంత్రాంగం రంగం సిద్ధం చేస్తోంది. వ్యాపార సంస్థలు తక్షణం పిఒఎస్ మెషిన్లు ఏర్పాటుచేసుకునే విధంగా సంబంధిత శాఖల అధికారులు ఆదేశాలు జారీచేశారు.తూర్పు గోదావరి జిల్లాలో ప్రస్తుతం సుమారు 2వేల 500 పిఒఎస్ మెషిన్లు వ్యాపారుల వద్ద అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్ బంకులు, జ్యూయలరీ షాపులు, వస్త్ర దుకాణాలు తదితర వాణ్యి సంస్థల్లో ఇప్పటికే వీటిని వినియోగిస్తున్నారు. చిన్న తరహా వ్యాపార సంస్థల్లో మాత్రం చాలావరకు పిఒఎస్ మెషిన్లను ఏర్పాటుచేసుకోలేదు. ఇటీవలి కాలంలో కేంద్ర ప్రభుత్వం జన్‌ధన్ కార్యక్రమాన్ని అమలుచేయడంతో పెద్ద ఎత్తున సామాన్యులకు సైతం రూపీ డెబిట్ కార్డులను ఆయా బ్యాంకులు జారీచేశాయి. పిఒఎస్ యంత్రాలను వ్యాపారులకు నామమాత్రపు ధరకే అందజేసేందుకు వివిధ బ్యాంకులు ముందుకువచ్చాయి.
కాగా పిఎస్‌ఒల ద్వారా జరిగే లావాదేవీలపై విధించే సర్వీస్ టాక్స్‌ను వచ్చే ఆరు నెలల పాటు రద్దు చేయాలని వ్యాపార సంస్థలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈమేరకు ఈ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపగా సానుకూలంగా ప్రభుత్వం స్పందించినట్టు అధికారులు చెప్పారు.