రాష్ట్రీయం

గ్రూపు మారితే చార్జీల మోతే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 1: గృహ విద్యుత్ వినియోగదారులకు సంబంధించి శ్లాబ్‌లను ఎత్తివేసి గ్రూపుల విధానాన్ని అమలు చేస్తే వినియోగదారుల జేబులకు చిల్లు పడుతుంది. మూడు గ్రూపుల్లో అంతర్గతంగా శ్లాబ్‌లను చేర్చారు. డిస్కాంల ఖజానా గలగలలాడుతుంది. ఏపి డిస్కాంల ప్రతిపాదనల ప్రకారం గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి కేటగిరీలుగా వినియోగదారులను వర్గీకరించారు. ఇందులో గ్రూప్ ఏ కేటగిరీలో సాలీనా ఆరు వందల యూనిట్లు వినిమయం చేసే వారిని చేర్చారు. గ్రూప్ బి కేటగిరీలో సాలీనా 600-2400 యూనిట్ల మధ్య, గ్రూప్ సి కేటగిరీలో సాలీనా 2400 యూనిట్లు వినియమం చేసే వారిని చేర్చారు.
గ్రూప్ ఏ కేటగిరీలో మొదటి 0-50 యూనిట్లకు యూనిట్‌కు రూ.1.45 పైసలు, 51-100 యూనిట్ల మధ్య రూ.2.60 పైసలు, 101-200 యూనిట్ల మధ్య రూ.3.60పైసలను వసూలు చేస్తారు. ఒక వేళ సాలీనా 601 యూనిట్లు కాల్చినట్లు నమోదైతే వారి రేట్లు మారిపోతాయి. వారిని గ్రూప్ బి కేటగిరీలో చేర్చి సవరించిన రేట్ల ప్రకారం బిల్లులు వసూలు చేయాలని ప్రతిపాదించారు.
నెలకు 200 యూనిట్ల చొప్పున లేదా ఏడాదికి 600 నుంచి 2400 యూనిట్ల మధ్య వినిమయం చేసే వారిని బి గ్రూపులో చేర్చుతారు. దీని ప్రకారం గ్రూప్ బిలో 0-50 యూనిట్లకు యూనిట్‌కు రూ.2.60 పైసలు, 51-100 యూనిట్ల మధ్య రూ.2.60 పైసలు, 101-200 యూనిట్ల మధ్య రూ.3.60 పైసలు, 201-300 యూనిట్ల మధ్య రూ.6.90 పైసలు, నెలకు 300 యూనిట్ల పైన నమోదైతే యూనిట్‌కు రూ.7.75 పైసలు చొప్పున వసూలు చేస్తారు.
ఇక గ్రూప్ సి కేటగిరీలో ఏడాదికి 2400 యూనిట్ల కంటే ఎక్కువ వినిమయం చేసే వారిని చేర్చుతారు. సింగిల్ ఫేజ్, త్రీఫేజ్ వినియోగదారులంతా ఇందులోకి వస్తారు. ఈ కేటగిరీలో శ్లాబ్‌ను చూస్తే 0-50 యూనిట్ల మధ్య యూనిట్‌కు రూ.2.60 పైసలు, 51-100 యూనిట్ల మధ్య యూనిట్‌కు రూ.3.25 పైసలు, 101-200 యూనిట్ల మధ్య యూనిట్‌కు రూ.5.26 పైసలు, 201-300 యూనిట్ల మధ్య యూనిట్‌కు రూ.6.90 పైసలు, 301-400 యూనిట్ల మధ్య యూనిట్‌కు రూ. 7.75 పైసలు, 401-500 యూనిట్ల మధ్య యూనిట్‌కు రూ.8.27 పైసలు, 500 యూనిట్లు దాటితే యూనిట్‌కు రూ. 8.80పైసలు వసూలు చేస్తారు. 2015-16 సంవత్సరానికి వినియోగదారులు మొత్తం వినిమయం చేసిన విద్యుత్‌ను పరిగణనలోకి తీసుకుని వారిని 2016-17 సంవత్సరంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చే గ్రూపులో చేర్చుతారు. ఈ గ్రూపుల విధానాన్ని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి అంగీకరించాల్సి ఉంటుంది. ఏపిఇఆర్‌సి అంగీకరించిన పక్షంలోనే కొత్త గ్రూప్‌ల విధానం అమలుకు ఆమోద ముద్ర పడుతుంది.