రాష్ట్రీయం

ఆమేరకు ఇవ్వాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 18: ప్రజా ప్రయోజనాల నిమిత్తం తమ భూములను ప్రభుత్వానికి ఇచ్చిన భూ యజమానులకు 2013 భూ సేకరణ చట్టం కింద నష్టపరిహారం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలను ఆదేశిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూరర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ ఎం సత్యనారాయణతో కూడిన ధర్మాసనం వెలువరించింది. 1894 భూసేకరణ చట్టం సెక్షన్ 11 కింద తమ భూములను ప్రభుత్వానికి అప్పగించి, నష్టపరిహారం ప్రకటించీ ఇంతవరకు చెల్లించని పరిస్ధితుల్లో, తాజాగా 2013 భూసేకరణ చట్టం కింద నష్టపరిహారం చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణాల నిమిత్తం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, భూసేకరణ అధికారులు, హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. సింగిల్ జడ్జి కోర్టు కూడా భూమి ఇచ్చిన యజమానులకు 2013 భూ సేకరణ చట్టం కింద నష్టపరిహారం చెల్లించాలని తీర్పులు ఇచ్చింది. తీర్పును సవాలు చేస్తూ హైకోర్టులో భూసేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు పిటిషన్లుదాఖలు చేశారు. ఈ సందర్భంగా హైకోర్టు రెండు రాష్ట్రాల్లో ఈ కేసుకు సంబంధించి అన్ని అంశాలకు వర్తిస్తుందని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం 2013 డిసెంబర్‌లో 1894 సెక్షన్ 11 భూసేకరణ కింద నష్టపరిహారం ఇస్తామని ప్రకటించింది. కొత్త భూసేకరణ చట్టం 2014 జనవరి 1 నుంచి అమలులోకి వచ్చింది. ఈ సందర్భంగా హైకోర్టు 152 పేజీల తీర్పు వెలువరించింది. కొత్త చట్టం అమలులోకి వచ్చినా, పాత చట్టం కింద జారీ చేసిన అవార్డు ప్రకారం నష్టపరిహారం చెల్లించని కేసులన్నింటికీ తమ తీర్పు వర్తిస్తుందని హైకోర్టు పేర్కొంది. రెండు సింగిల్ జడ్జి కోర్టులో ఈ అంశంపై భూయజమానులకు ఊరట కలిగించే విధంగా తీర్పు వచ్చింది. తీర్పును భూసేకరణ అధికారులు సవాలు చేశారు. నాలుగు నెలల్లోగా భూసేకరణ అధికారులు కొత్త చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. భూ యజమానుల నుంచి భూమిని సేకరించి పాత చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించి ఉంటే, కొత్త చట్టం ప్రకారం మిగిలిన నష్టపరిహారం చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.