రాష్ట్రీయం

ఆయుధ వ్యాపారానికే సైనిక విన్యాసాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 19: అగ్రరాజ్యాలు ఉమ్మడి సైనిక విన్యాసాల పేరిట ఆయుధ వ్యాపారానికి అర్రులు చాస్తున్నాయని ఇంటర్నేషనల్ ఫోరమ్ ఆన్ గ్లోబలైజేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కుహాన్ పాయక్ ఆందోళన వ్యక్తం చేశారు. గ్లోబల్ నెట్‌వర్క్ ఎగైనెస్ట్ వెపన్స్ అండ్ న్యూక్లియర్ పవర్ ఇన్ స్పేస్, గీతం స్కూల్ ఆఫ్ లా సంయుక్తంగా ‘్భ అంతరిక్షాలలో శాంతి, ప్రపంచ భద్రత, మానవాభివృద్ధి’ అంశంపై నిర్వహిస్తున్న సదస్సు రెండో రోజు శనివారం పలువురు వక్తలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా పాయక్ మాట్లాడుతూ ప్రపంచ కప్ కోసం పోటీపడే రీతిలో హవాయి జలాల్లో ప్రపంచంలోని 26 దేశాలు ప్రతి రెండేళ్లకు ఒకసారి ఉమ్మడి సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయన్నారు. వీటిలో 45 యుద్ధ నౌకలు, 200 వరకూ యుద్ధ విమానాలు, 5 జలాంతర్గాములు, 25వేల మంది సైనికులు పాల్గొంటున్నారన్నారు. దీని ద్వారా తమ దేశాల్లో ఉత్పత్తి చేసే యుద్ధ సామగ్రిని ప్రదర్శిస్తూ మార్కెటింగ్ చేసుకుంటున్నాయని ఆరోపించారు.
సైనిక విన్యాసాల కారణంగా ఆసియా, పసిఫిక్ తీరంలో పెద్ద ఎత్తున విధ్వంసం జరుగుతోందని, పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా నౌకాదళం నీరు, భూమిపై వినియోగించే యాంఫీబియన్ తరహా యుద్ధ వాహనాలను రూపొందించిందని, వీటిని ఆసక్తిగల దేశాలకు విక్రయించేందుకు సైనిక విన్యాసాల పేరిట వివిధ దేశాల ముందు ప్రదర్శిస్తోందన్నారు. ఆసియా, పసిఫిక్ ప్రాంతంలో పట్టుకోసం అమెరికా, చైనా దేశాలు పోటీపడి మరీ మిలిటరీ స్థావరాలను విస్తరిస్తున్నాయన్నారు. చైనా తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు కృత్రిమంగా ఏడు యుద్ధ స్థావరాలను నిర్మించిందన్నారు. మరో పక్క భారత్ కూడా అండమాన్ నికోబార్ దీవుల్లో వియత్నాం దేశంతో కలిసి యుద్ధ స్థావరాలను విస్తరిస్తోందన్నారు. గ్లోబల్ నెట్‌వర్క్ ఎగైనెస్ట్ వెపన్స్ అండ్ న్యూక్లియర్ పవర్ ఇన్ స్పేస్ కోఆర్డినేటర్ డేవ్ వెబ్ మాట్లాడుతూ ప్రజల ఇబ్బందులు, వాతావరణ మార్పుల వల్ల ఎదురవుతున్న సంక్షోభాలను పరిష్కరించడాన్ని విస్మరించి అమెరికా సహా నాటో సభ్య దేశాలు సమస్యలకు మిలిటరీ చర్యలే పరిష్కారంగా అనే్వషించడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. మిస్సైల్ రక్షణ యంత్రాలను అభివృద్ధి చేసుకునేందుకు భారీ బడ్జెట్ కేటాయించడంతో యూరోపియన్ దేశాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురికావాల్సి వస్తోందన్నారు. అమెరికా తన రక్షణ పరిజ్ఞానానికి మార్కెట్‌ను విస్తరించుకునేందుకు ప్రపంచ యుద్ధాన్ని కాంక్షిస్తోందని, దీనికి గాను వివిధ దేశాలకు ఆయుధాలను విక్రయించుకోవడమే పనిగా పెట్టుకుందని ఆరోపించారు.
సంస్థ యూరప్ కోఆర్డినేటర్ బ్రూస్ కె గగనాన్ మాట్లాడుతూ అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఆయుధ వ్యాపారం ప్రధానంగా మారిందన్నారు. ఆసియా, పసిఫిక్ ప్రాంతంలో చైనా, రష్యా ప్రాబల్యాన్ని తగ్గించేందుకు అమెరికా 800కు పైగా సైనిక స్థావరాలను విస్తరించిందని, జపాన్, దక్షిణ కొరియాతో కలిసి సంయుక్తంగా రక్షణ సామగ్రిని రూపొందించుకోవడం గమనిస్తే 3వ ప్రపంచ యుద్ధానికి సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోందన్నారు. అమెరికా సహా ప్రపంచ దేశాలు యుద్ధ కాంక్షను వీడి శాంతికోసం పనిచేయాలని, ప్రజల సమస్యలపై దృష్టి సారించాలని ఈ సదస్సుద్వారా మరికొంతమంది వక్తలు పిలుపునిచ్చారు.